వైర‌ల్.. ఇలాంటి ఐస్ క్రీమ్ దోష‌ను మీరెప్పుడైనా తిన్నారా..

ఒక‌ప్పుడు తిండి దొర‌క్క ఇబ్బంది ప‌డేవారు మ‌నుషులు.అంటే పొట్ట నింపుకునేందుకు ఏదో ఒక‌టి తింటే స‌రిపోతుంది అనుకువారు.

 Viral .. Have You Ever Eaten An Ice Cream Bug Like This .., Ice Cream Bug,  Vira-TeluguStop.com

కానీ ఇప్పుడు ఆ పొట్ట‌లోకి ఆహారం వెళ్లాలంటే ఏదో ఒక కొత్త టేస్ట్ కావాలంటున్నారు జ‌నాలు.ఇందుకోసం ఆహార ప్రియుల‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు చాలా ర‌కాల కొత్త ఆహార ప‌దార్థాల‌ను సృష్టిస్తున్నారు.

ఇలాంటి వింత ఆహారాల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ కాకుండా ఉంటాయా.ఇప్పుడు ఇదికూడా విప‌రీతంగా వైర‌ల్ అయిపోతోంది.

మ‌రి దాని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక‌ప్ప‌టి కంటే కూడా ఇప్ప‌టి ఆహారాల విష‌యంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఆహారాన్ని ఏదో ఒక ర‌కంగా కొత్త టేస్ట్ వ‌చ్చేలా చూస్తున్నారు చాల‌మంది.అందుకే సంప్రదాయ వంటకాల నుంచి రుచి క‌ర‌మైన వంట‌ల దాకా మార్పు చెందింది మ‌న వంట‌కం.

మ‌న దేశంలో దక్షిణాది ప్రాంతాల్లో ఒక ర‌క‌మైన వంట‌కాలు ఉంటే ఉత్తరాది రాష్ట్రాల్లో మ‌రో ర‌క‌మైన ఆహార‌పు అల‌వాట్లు ఉంటాయి.ఇప్పుడు కూడా ఓ డిఫ‌రెంట్ ఆహార ప‌దార్థం నెట్టింట చెక్క‌ర్లు కొడుతోంది.

సాధార‌ణంగా మ‌న‌కు మార్నింగ్ టైమ్‌లో చేసే దోష టిఫిన్ తెలిసే ఉంటుంది.

దోశ అంటే చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా అంద‌రికీ ఇష్ట‌మే క‌దా.ఈ దోశల్లో చాలా రకాలు వంట‌కాలు కూడా ఉంటున్నాయి.ఉల్లిగ‌డ్డ‌ల దోశ అని ఉప్మా దోశ అని మ‌సాలా దోష ఇలా చాలా ర‌కాలు ఉంటున్నాయి.

కానీ ఇప్పుడు మాత్రం ఐస్ క్రీం దోశ బాగా పాపుల‌ర్ అయిపోతోంది.అదేంటి ఐస్ క్రీమ్ దోష‌నా అని ఆశ్చ‌ర్య‌పోకండి.ఈ వైర‌ల్ వీడియోలో వేడి పెనంపై అప్పుడే తాజా దోశను వేస్తున్న‌ట్టు మ‌నం చూడొచ్చు.ఇక ఈ దోష మీద ఐస్ క్రీమ్ ఫ్లేవ‌ర్ తో పాటు చాక్లెట్ క్రీమ్ ను అత‌గాడు వేసి దోశ పూర్తిగా వేగేలా చూస్తాడు.

ఆ త‌ర్వాత దాన్ని తినేందుకు స‌ర్వ్ చేస్తాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube