ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థకు 'మహాసముద్రం' రైట్స్!

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘మహాసముద్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో హీరో సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడు.

 Netflix Bags Post Theatrical Digital Streaming Rights, Netflix, Streaming Rights-TeluguStop.com

చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.అజయ్ భూపతి తో పాటు శర్వానంద్, సిద్ధార్థ్ కూడా ఈ సినిమా హిట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.అక్టోబర్ 14న దసరా సీజన్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దీంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేస్తున్నారు.

అందులో భాగంగానే ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చెయ్యగా ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Telugu Anu Emmanuel, Dasara Race, Maha Samudram, Netflix, Netflixbags, Sharwanan

ఇక ఈ మధ్యనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారు.రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ సొంత చేసుకుంది.దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసింది.

మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రోజులకు స్ట్రీమింగ్ అవుతుందో తెలియాల్సి ఉంది.

Telugu Anu Emmanuel, Dasara Race, Maha Samudram, Netflix, Netflixbags, Sharwanan

ఇక ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తుండగా.అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారు.

చైతన్య భరద్వాజ్ సంగీతం అందించారు.మరి చూడాలి ఈ సినిమా ఎంత మేరకు ఆకట్టుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube