స్టైలిష్ స్టార్‌ కంచెరపాలెం లుక్‌ అభిమానులు అవాక్కు

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ మొదలు అయ్యి చాలా నెలలు అవుతోంది.కరోనా కారణంగా కొన్ని నెలల పాటు సినిమా వాయిదా పడింది.

 Allu Arjun Pushpa Movie New Look,latest Tollywood News-TeluguStop.com

తద్వారా సినిమా షూటింగ్ కూడా ఆలస్యం అయ్యింది.ఇక ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

రికార్డు స్థాయి అంచనాలున్న ఈ సినిమా లో అల్లు అర్జున్ లుక్ పై ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు.మాసిన గడ్డం మరియు పొడవైన జుట్టుతో రఫ్‌ లుక్ లో బన్నీ కనిపిస్తున్నాడు.

ఎట్టకేలకు అల్లు అర్జున్ నుండి పుష్ప పూర్తి లుక్ వచ్చింది.ఇన్నాళ్లు మొహాలు.

లేదా సైడ్‌ యాంగిల్‌ నుండి మాత్రమే చూడటం జరిగింది.ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా అల్లు అర్జున్‌ ను ఇలా ఊహించుకుని ఉండరు అన్నట్లుగా ఆయన తాజా లుక్‌ ఉంది.

Telugu Allu Arjun, Pushpa, Sukumar-Movie

దసరా సందర్బంగా సినిమా నుండి రెండవ పాటను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.అందుకోసం ఈ ఫొటోను విడుద లచేశారు.ఈ ఫొటోలో బన్నీ కంచెరపాలం సినిమాలో హీరో ఉన్నట్లుగా ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.స్టైలిష్ స్టార్‌ ను మరీ ఇలా మాస్ స్టార్‌ గా చూడటం మా వల్ల కావడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్న ఈ సినిమాకు గాను బన్నీ ఫ్యాన్స్ మాత్రం కొంత మేరకు పాజిటివ్ గా ఉన్నారు.తప్పకుండా ఇదో మంచి ప్రయత్నం అవుతుందని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప రాజ్ పాత్రకు బన్నీ తప్ప మరెవ్వరు సెట్‌ కారు అన్నట్లుగా ఆయన లుక్ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.నిజంగా ఇది ఒక అద్బుతం అన్నట్లుగా కొందరు అంటున్నారు.

కాని కొందరు మాత్రం స్టైలిష్‌ స్టార్‌ కంచెరపాలం లుక్‌ అవాక్కయ్యేలా ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube