అమెరికా: కాలిఫోర్నియాలో కుప్పకూలిన విమానం.. మృతుల్లో భారత సంతతి వైద్యుడు

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.శాన్ డియాగో శివారు ప్రాంతంలో ఉన్న సాంటీలోని నివాస గృహాల‌పై విమానం నేల‌కూలింది.

 Indian-origin Cardiologist Among Two Killed In California Plane Crash , America,-TeluguStop.com

ఈ ఘటనలో పైలట్, యూపీఎస్ డ్రైవర్ మరణించారని అధికారులు పేర్కొన్నారు.ట్విన్ ఇంజిన్ సెస్‌నా 340 రకం విమానం కూలిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

ఆరిజోనాలోని యుమా నుంచి ఈ విమానం టేకాఫ్ అయ్యింది.ఈ ఫ్లైట్ కూలిన ప్ర‌దేశంలో ఓ ట్ర‌క్కు, కొన్ని ఇళ్లు కాలిబూడిద‌య్యాయి.

అయితే ప్రమాదస్థలిలో వున్న సంత‌నా హై స్కూల్‌లో విద్యార్థులు సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తెలిపారు.పాఠశాల సమీపంలో అకస్మాత్తుగా విమానం కుప్పకూలి రోడ్డుపైకి దూసుకొచ్చిందని.

దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది.

మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

అయితే ఈ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో భారత సంతతికి చెందిన కార్డియాలజిస్ట్ కూడా వున్నట్లుగా తెలుస్తోంది.

ఆ విమానం ఆరిజోనాలోని యుమా రీజినల్ మెడికల్ సెంటర్‌ (వైఆర్ఎంసీ)లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుగత దాస్‌దేనని అధికారులు చెబుతున్నారు.అయితే క్రాష్ జరిగిన సమయంలో దాస్ పైలట్ సీట్‌లో వున్నారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.

విమాన ప్రమాదంలో సుగత చనిపోయినట్లుగా వస్తున్న వార్తలతో వైఆర్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ భరత్ మగు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తమ సంస్థలో అత్యుత్తమ కార్డియాలజిస్ట్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారని.

ఈ విపత్కర పరిస్ధితుల్లో దాస్ కుటుంబానికి, సహోద్యోగులు, స్నేహితులకు అండగా వుంటామని భరత్ తెలిపారు.

Telugu America, Arizona, Cardiologist, Indianorigin, San Diego, Sugatha Dasdena,

మరోవైపు ఇదే విమాన ప్రమాదంలో మరణించిన మరో వ్యక్తి తమ ఉద్యోగేనని యూపీఎస్ ధృవీకరించింది.అతనిని కోల్పోయినందుకు బాధగా వుందని.ఆయన కుటుంబానికి, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు యూపీఎస్ ఒక ప్రకటన జారీ చేసింది.

కాగా,.ప్రమాదానికి గురైన సెస్నా సీ 340 విమానాన్ని సాధారణంగా వ్యాపార అవసరాల కోసం వినియోగిస్తారు.

ఇందులో ఆరుగురు ప్రయాణీకులు కూర్చొనే సదుపాయం వుందని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube