మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా మంచు కుటుంబం నుంచి విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేయగా మెగా కుటుంబం మద్దతుతో ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీ చేశారు.ఈ క్రమంలోనే మా ఎన్నికలు మంచు వర్సెస్ మెగా కుటుంబానికి అన్నట్టుగానే కొనసాగాయి.
ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు తెలుపుతూ మెగా బ్రదర్ నాగబాబు మంచు కుటుంబం పై ఎన్నో ఆరోపణలు చేశారు.ఇలా ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఈ ఎన్నికలు జరపగా ఎన్నికలలో మంచు కుటుంబం విజయభేరీ మోగించింది.
ప్రకాష్ రాజు ఫైనల్ పై అత్యధిక మెజార్టీతో గెలిచిన మంచు విష్ణు గెలుపు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ క్రమంలోనే మంచు విష్ణు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ నేను మా ఎన్నికలకు పోటీ చేస్తున్నాను అని తెలియగానే చిరంజీవి అంకుల్ నాన్న గారికి ఫోన్ చేసి నన్ను ఈ పోటీ నుంచి తప్పుకొమ్మని స్వయంగా నాన్నకి ఫోన్ చేసి చెప్పారని ఈ సందర్భంగా విష్ణు తెలిపారు.
ఇలా నాన్నగారికి చిరంజీవి అంకుల్ ఫోన్ చేసిన తర్వాత నాన్నగారు రంగంలోకి దిగి ఎలాగైనా ఈ ఎన్నికలలో గెలవాలని భావించారు.చివరికి మంచు విష్ణు అత్యధిక ఓట్ల మెజార్టీతో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న తర్వాత మీడియా సమావేశంలో చిరంజీవి గారి గురించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.మంచు విష్ణు గెలుపు తర్వాత ప్రకాష్ రాజ్, నాగబాబు మా సభ్యత్వం నుంచి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.