ప్రచారంలో దూసుకెళ్తున్న టీఆర్ఎస్.. హరీష్ రావు వ్యూహాలు ఫలించేనా?

హుజూరాబాద్ లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.ఎంతలా అంటే ఏ నలుగురు కూర్చున్నా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది.

 Trs Looming In The Campaign Will Harish Rao's Tactics Work Huzurabad Elections,-TeluguStop.com

హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అన్న విషయం తెలిసిందే.అయితే ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇప్పటికే పర్యటిస్తూ అన్ని వర్గాల వారిని సమీకరిస్తూ టీఆర్ఎస్ వైపు మలుచుకుంటున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికే హరీష్ రావు వ్యూహాలు వేస్తూటీఆర్ఎస్ ను గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో ఎక్కడా దూకుడు తగ్గించడం లేదు.

అయితే ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ రూపంలో టీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంది.

Telugu @bjp4telangana, @harish2you, Huzurabad, Trs-Political

అయితే ఇప్పటి వరకు హుజూరాబాద్ లో దళిత బంధు పధకం అమలు చేసిన పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు లాభం జరుగుతుందా లేక దళితులు టీఆర్ఎస్ కు కాకుండా వేరే పార్టీలకు మద్దతిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.అయితే ప్రజలు టీఆర్ఎస్ కు మద్దతు తెలపక ఇతర పార్టీలకు మద్దతు తెలిపితే టీఆర్ఎస్ కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉందనే ప్రచారం తీవ్ర స్థాయిలో జరిగే అవకాశం ఉంది.ఇది వచ్చే సార్వత్రిక ఎన్నికలలో టీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బ తీసే అవకాశం లేకపోలేదు.

అయితే ఇప్పటి వరకు హుజూరాబాద్ లో విజయం పట్ల టీఆర్ఎస్ చాలా నమ్మకంగా ఉన్నా ఎక్కడో చివరి క్షణంలో ఎన్నికల్లో ఏమైనా జరగచ్చు కావున పోలింగ్ చివరికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి టీఆర్ఎస్ ఇష్టపడటం లేదు.   ఏది ఏమైనా టీఆర్ఎస్ ఈ ఎన్నికలో విజయం సాధిస్తుందా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube