హుజూరాబాద్‌లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థుల‌తో ఆ ఇద్ద‌రికీ స‌వాళ్లే..

తెలంగాణ మొత్తం అటువైపు చూస్తోంది.అక్క‌డ ఎప్పుడు ఏం జ‌రుగుతుందా అని అన్ని పార్టీలు వ్యూహాలు ప్ర‌తి వ్యూహాలు చేస్తున్నాయి.

 Both Of Them Are Challenging The Independent Candidates In Huzurabad.., Huzuraba-TeluguStop.com

ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ కొట్టేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు.అన్ని పార్టీల భ‌విత‌వ్యం ఈ నెల ఈ నెల 30న తేలిపోనుంది.

ప్ర‌ధానంగా బీజేపీ, టీఆర్ఎస్ న‌డుమ‌నే ఈ పోటీ జ‌రుగుతోంది.కాగా వీరికి ఇప్పుడు ఇండిపెండెం ట్ అభ్యర్థులు చుక్క‌లు చూపిస్తున్నారు.

వీరు ఇప్పుడు అన్ని పార్టీల‌కు పెద్ద ప‌రీక్షే పెడుతున్నార‌ని చెప్పాలి.ఎందుకంటే టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున పీల్డు అసిస్టెంట్లు నామినేష‌న్లు వేశారు.

వీరితో పాటు కొంద‌రు రాజేంద‌ర్ పేర్ల మీద కూడా నామినేశ‌న్ వేశారు.ఇంకా చెప్పాలంటే ఈ అనే అక్ష‌రం మొద‌ట వ‌చ్చే విధంగా ఉన్న అభ్య‌ర్థులు కూడా నామినేష‌న్ వేశారు.

దీంతో ఫీల్డు అసిస్టెంట్ల‌తో ఇటు టీఆర్ఎస్ కు రాజేంద‌ర్ అనే పురు గ‌ల అభ్య‌ర్థుల‌తో బీజేపీకి చిక్కులు త‌ప్ప‌ట్లేదు.ఇప్ప‌టి దాకా టీఆర్ఎస్ బీజేపీ న‌డుమ‌నే వార్ న‌డుస్తోంది.

అలాంటి స‌మ‌యంలో ఈ వార్‌ను ఇర‌కాటంలో ప‌డేసే విధంగా ఇండిపెండెంట్లు నామినేష‌న్ వేయ‌డంతో గెల్లు శ్రీనివాస్‌కు, ఈట‌ల రాజేంద‌ర్‌కు త‌ల‌నొప్పి త‌ప్ప‌ట్లేదు.ఓవైపు టీఆర్ ఎస్ అంద‌రికంటే ఎక్కువ ఖ‌ర్చు పెడుతోంది.

Telugu Huzurabad, Tg, Ts-Telugu Political News

కానీ ఈట‌ల‌ను ఓడించేందుకు ఏకంగా దళిత బంధును లాంటి స్కీమ్‌ను కూడా తెర‌మీద‌కు తెచ్చిందంటేనే ఎంత ప‌ట్టుమీద ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.స్వయంగా మంత్రి హరీష్ రావు గెలుపు బాధ్య‌త‌ల‌ను మోస్తున్నారంటేనే గెలుపు మీద టీఆర్ ఎస్‌కు ఉన్న పంతం ఏంటో అర్థం అవుతోంది.ఇక‌పోతే బీజేపీ నుంచి కేవ‌లం ఈట‌ల రాజేంద‌ర్ మాత్ర‌మే పోరాడుతున్నారు.

అయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు టీఆర్ ఎస్‌, బీజేపీలను టెన్ష‌న్ పెట్టే విధంగా త‌మ ఎన్నిక‌ల గుర్తులను నిర్ణ‌యించుకోవ‌డంతో ఇటు ప‌డే ఓట్లు కాస్తా అటు ప‌డితే మాత్రం ఇరుపార్టీల‌కు ప్ర‌మాద‌మ‌నే చెప్పాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube