టీఆర్ఎస్ అనుకూల పవనాల పెంపుపైనే ఇక టీఆర్ఎస్ దృష్టి పెట్టనుందా?

ప్రతి ఒక్క రాజకీయ పార్టీ చివరకు ఓట్లు సాధించాలనే లక్ష్యం ఉంటుంది.అయితే రాజకీయాల్లో చివరకు ప్రజలే న్యాయ నిర్ణేతలు.

 Should Trs Focus On Increasing Pro Trs Winds, Kcr, Trs Party, Kcr, Congress, Bjp-TeluguStop.com

ప్రజలు ఏ పార్టీకైతే మద్దతు ఇస్తారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.ఇక ఐదేళ్లు వారు అధికారంలో ఉంటారు.

ఈ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే తరువాతి ఎన్నికల్లో వారు గెలుపుకు దోహదపడుతాయి.ఇక అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది.

అయితే మొదటి సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు తగిన బలమైన ప్రతిపక్షం లేదు.కావున రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సునాయాసంగా  విజయం సాధించింది.

అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికలలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం లేదు.ఎందుకంటే అప్పుడు బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కాస్త బలపడిన పరిస్థితి ఉంది.

అంతేకాక బీజేపీ కూడా అప్పట్లో తెలంగాణలో గుర్తింపు లేదు.కానీ ఇప్పుడు టీఆర్ఎస్ తరువాత రెండో స్థానం గురించి పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.

గడిచిన  గత రెండు నెలలుగా ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ప్రజా సంగ్రామ యాత్ర, దళిత గిరిజన భేరి లతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయనే విషయం తెలిసిందే.దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందనే భావన చాలా మందిలో వ్యక్తమయింది.

Telugu @cm_kcr, Huzurabad, Cm Kcr, Congress, Dalitagirijana, Kcr, Prajasangrama,

అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నష్ట నివారణ చర్యలు చేపడుతోంది.ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ అనుకూల పవనాలు పెంపుపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.అందుకే ప్రతిపక్షాల విమర్శలను తీసుకుంటాం.సరిచేసుకుంటాం అన్న రీతిలో కెసీఆర్ వాయిస్ ఈ వ్యాఖ్యలకు ఊతమిచ్చినటవుతోంది.అయితే ప్రజాగ్రహ విషయాలపై దృష్టి పెట్టి టీఆర్ఎస్ అనుకూల పవనాలను పెంచుకోవాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube