సమంత చేతిలో మూడు కొత్త సినిమాలు.. కానీ అసలు సమస్య ఏమిటంటే?

స్టార్ హీరోయిన్ సమంతకు ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.పెళ్లికి ముందు పెళ్లి తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నటీమణుల్లో సమంత కూడా ఒకరు.

 Star Heroine Samantha Green Signal For Three Movies Details, Green Signal, Inter-TeluguStop.com

చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత ప్లానింగ్ ఏమిటనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.సమంత ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు.

అయితే సమంత చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తోంది.

కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

కొన్నిరోజుల క్రితం ఈ వార్త ప్రచారంలోకి రాగా ప్రస్తుతం సమంత మరో రెండు ప్రాజెక్టులకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.అయితే ఈ రెండు ప్రాజెక్టులు ఏ భాషలో తెరకెక్కనున్నాయో తెలియాల్సి ఉంది.

త్వరలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వారం రోజుల్లో ఈ ప్రాజెక్టుల గురించి మరింత క్లారిటీ రానుందని సమాచారం అందుతోంది.

Telugu Gunasekhar, Green Signal, Samantha, Shaakuntalam-Movie

మరోవైపు చాలామంది దర్శకనిర్మాతల దగ్గర సమంతకు సూటయ్యే సబ్జెక్టులు ఉన్నాయని సమాచారం.అయితే చైసామ్ విడాకుల ప్రకటన వల్ల సమంతతో సినిమా తెరకెక్కించే విషయంలో వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది.సమంత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.

Telugu Gunasekhar, Green Signal, Samantha, Shaakuntalam-Movie

మరోవైపు సమంత ఇకపై ఎలాంటి పాత్రల్లో నటిస్తారో చూడాల్సి ఉంది.సోషల్ మీడియాలో మాత్రం సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.సమంత సోషల్ మీడియాలో కంపెనీలను ప్రమోట్ చేయడానికి సైతం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

కొంతమంది సమంతతో ప్రాజెక్ట్ ఓకే చేస్తే చైతూతో రిలేషన్ ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.సమంతకు బాలీవుడ్ ఆఫర్లు కూడా వస్తున్నాయని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube