అల్లరి ప్రేమికుడు సినిమా వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వెండితెరపై సందడి చేశాయి.

 Interesting Story Behind Allari Premikudu Movie Allari Priyudu, Kamal Hassan, Ra-TeluguStop.com

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వస్తున్న సినిమాలు అంటే ప్రేక్షకులకు మంచి అవగాహన ఉండేది.ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన అల్లరి ప్రియుడు, అల్లరి మొగుడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల తర్వాత రాఘవేంద్రరావు అల్లరి ప్రేమికుడు అనే సినిమాను తెరకెక్కించాలని భావించారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరో పాత్రలో కమల్ హాసన్ హీరోయిన్ల పాత్రలో మీనా దివ్యభారతిని ఎంపిక చేసుకున్నారు.

అయితే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించే సమయానికి దివ్యభారతి అనుకోకుండా మరణించడం వల్ల ఈ సినిమా కాస్త లేట్ అయింది.

అయితే అనుకున్న ప్రకారం సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో మీనాకి కూడా డేట్స్ అడ్జస్ట్ కాలేదు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సౌందర్య రంభను ఎంపిక చేశారు.అయితే కథలో కొద్దిగా మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఈ సినిమాకి మరో హీరోయిన్ అవసరం అయ్యింది.

Telugu Allari Priyudu, Divya Bharathi, Jagapath Bbau, Kamal Hassan, Meena, Ragha

ఈ సమయంలోనే అల్లరి ప్రేమికుడు సినిమాలో నటించడం కోసం మరొక కొత్త హీరోయిన్ కాంచన్ ను ఎంపిక చేసుకున్నారు.ఇలా ముందుగా అనుకున్న హీరోయిన్లు కాకుండా ఈ సినిమాలో వేరే హీరోయిన్స్ వచ్చారు.ఇకపోతే ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించడానికి కమల్ హాసన్ కన్నా జగపతి బాబు అయితే ఎంతో బాగుంటుందని దర్శకుడు కమల్ హాసన్ పాత్రలో జగపతి బాబును ఎంపిక చేశారు.

Telugu Allari Priyudu, Divya Bharathi, Jagapath Bbau, Kamal Hassan, Meena, Ragha

అప్పట్లో జగపతిబాబుకు ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి క్రేజ్ ఉండేది.ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రచయిత సత్యానంద్, సురేష్ కలిసి ఈ సినిమాను 1993 డిసెంబర్ 31వ తేదీ రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు.ఇలా ప్రారంభమైన ఈ సినిమాకు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు గారు ఫస్ట్ క్లాప్‌ ఇచ్చి షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు.

అలా ఎన్నో అంచనాల నడుమ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకొని ప్రేక్షకులముందుకు అల్లరి ప్రేమికుడు సినిమా విడుదల అవడంతో.ఈ సినిమాకు ప్రేక్షకాదరణ కరువైందని, అనుకున్న స్థాయిలో ఈ సినిమా విజయం సాధించలేక పోయిందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube