తనికెళ్ళ భరణి ముఖ్య అతిధిగా ప్రారంభమైన సాయిరాం ప్రొడక్షన్స్

ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి ముఖ్య అతిధిగా యార్లగడ్డ వెంకట రమణ నిర్మాణ సారథ్యంలో సాయిరాం ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఆవిర్భావ సభ పూజ కార్యక్రమాలతో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యింది.మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాలన్న ఆకాంక్ష తో ఎంతో ప్యాషన్ తో ఈ నిర్మాణ సంస్థ ను ఏర్పాటు చేశారు నిర్మాత.

 Sairam Productions Started With Famous Actor Tanikella Bharani As The Chief Gues-TeluguStop.com

అయన యువకులను, ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలని స్థాపించిన ఈ సంస్థ నుంచి త్వరలోనే రెండు సినిమాలు అనౌన్స్ కాబోతున్నాయి.శ్రీపాల్ రెడ్డి, వీర అనే ఇద్దరు దర్శకులు దర్శకులుగా చేయబోతున్నారు.

శ్రీ బీ ఎస్ వీ పద్మారెడ్డి సమర్పణ లో శ్రీమతి జి.లక్ష్మి రెడ్డి సహా నిర్మాతగా,సాంబశివరావు కామేపల్లి ఎక్సజిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా లకు సంబందించిన నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తామన్నారు.

నిర్మాత యార్లగడ్డ వెంకట రమణ మాట్లాడుతూ.

.

సాయిరాం ప్రొడక్షన్స్ సంస్థలో యువ దర్శకులతో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయాలనీ ప్లాన్ చేసాం.

మా మంచి కోరుకునే తనికెళ్ల భరణి గారి ఆశీస్సులతో మేము ముందుకు వెళ్తున్నాం.త్వరలోనే మేము చేయబోయే సినిమాలను అనౌన్స్ చేస్తాం.

ప్రేక్షకులకు మా సంస్థ నుంచి మంచి అందించడమే మా లక్ష్యం అన్నారు.

Telugu Young Directors, Sai Ram, Sairam, Tankallibharani, Tollywood, Web, Yarlag

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.

సాయిరాం ప్రొడక్షన్స్ ఇవాళ ఆవిర్భావం.ఒక మంచి రోజున ఈ నిర్మాణ సంస్థ మొదలవడం ఆనందంగా ఉంది.

నిర్మాత పద్మారెడ్డి గారు చాలా ఏళ్లుగా తెలుసు.ఆయన సినిమా ఇండస్ట్రీ లో ముప్పై ఏళ్లుగా ఉన్నారు.

దర్శకుడు కృష్ణా రెడ్డి గారితో అయన పనిచేసేవారు.ఇప్పుడు ఈ సాయిరాం ప్రొడక్షన్స్ ను ఆరంభించారు.

త్వరలోనే రెండు సినిమాలను చేయబోతున్నారు.ఈ రెండు సినిమాల స్క్రిప్ట్స్ చాలా బాగున్నాయి.

దానికి సంభందించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.వీరందరూ కలిసి మొదలుపెట్టిన ఈ సినిమాలు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube