సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద ధర్నా చేసిన సీపీఎం నేతలు.ఎం.
ఎం.టీ ఎస్ పేజ్ 2ను వెంటనే పూర్తి చేసి రైళ్లను నడపాలని డిమాండ్ చేశారు.నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.
ధర్నాలో పాల్గొన్న నేతలు కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వారు మాట్లాడుతూ హైదరాబాద్ సిటీలో ప్రజా రవాణా పెంపొందించేందుకు ఎం.ఎం.టి.ఎస్.ఫేజ్-2 క్రింద చేపట్టిన పనుల్లో సికింద్రాబాద్-ఘట్కేసర్, సికింద్రాబాద్-మేడ్చెల్, ఫలక్ నుమా-ఉందానగర్, రామచంద్రా పురం-తెల్లాపూర్ రూట్లలో పనులన్నీ పూర్తయినందున తక్షణమే ఈ రూట్లలో రైళ్ళను ప్రారంభించాలని కోరారు.2014 లో ప్రారంభించిన ఫేజ్-2 పనులు 2018నాటికి పూర్తి కావాల్సిఉండగా ఇప్పటి వరకు పూర్తికాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.సనత్నగర్-మౌలాలి రూట్ లో పాక్షికంగా మాత్రమే పనులు జరిగాయని అన్నారు.ఎం.ఎం.టి.ఎస్.ఫేజ్-2 అంచనా వ్యయం రూ.816 కోట్లు కాగా ఇప్పటికే రూ.808 కోట్లు ఖర్చయ్యాయి, పనులన్నీ పూర్తికాకపోగా పూర్తయిన రూట్లలో కూడా రైలు నడవక పోవడం ప్రజాధనాన్ని వృధా చేయడమేనని ఆరోపించారు.
లక్షలాది మంది ప్రయాణీకులకు తక్కువ ఖర్చుతో సౌకర్యంగా ప్రయాణం చేసే అవకాశంఉంటుందని పేర్కొన్నారు.రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.ఇప్పటికైనా పూర్తయిన రూట్లలో వెంటనే రైళ్ళను ప్రారంభించాలని, సనత్నగర్-మౌలాలి రూట్లో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు…
.