మేయర్‌పై అవిశ్వాస తీర్మానం: అనుకూలంగా 36 ఓట్లు

కాకినాడ: కాకినాడ మేయర్‌ సుంకర పావని, డిప్యూటీ మేయర్‌ సత్తితబాబుపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు.ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి జేసీ లక్ష్మీశ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

 No-confidence Motion Against The Kakinada Mayor 36 Votes In Favor, No-confidence-TeluguStop.com

మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీడీపీ కార్పొరేటర్లు చేతులెత్తలేదు.కాగా, ఎక్స్‌ అఫిషియో ఓటర్లుగా మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంపీ వంగా గీత ఓటువేశారు.

అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 36 ఓట్లు లభించాయి.అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఓటు వేశారు.

అయితే కోర్టు కేసు నేపథ్యంలో ఫలితాలను ప్రిసైడింగ్‌ అధికారి రిజర్వ్‌ చేశారు.కోర్టు తీర్పు తర్వాత ఫలితాలనుఅధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
44 మంది కార్పొరేటర్లతో పాటు మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో కలిసి 47 మందికి ఓటు హక్కు ఉంది.మూడింట రెండు వంతుల మంది అంటే 31 మంది హాజరైతేనే కోరం ఉంటుంది.

చేతులెత్తే పద్ధతిపై ఓటింగ్‌ జరుగుతుంది.అవిశ్వాసం నెగ్గాలంటే 31 మంది అనుకూలంగా ఓటు వేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube