తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్ల ను అభినందించిన మంత్రి కేటీఆర్

తన వాహనానికి విధించిన చలాన్ ను చెల్లించిన మంత్రి కేటీఆర్.నిబంధనలు ప్రజల కైనా ప్రజాప్రతినిధులకైనా ఒకటే అన్న మంత్రి కేటీఆర్.

 Ktr Appreciated Si Ilayya And Constable Venkateswarlu For Challan His Vehicle, K-TeluguStop.com

నిజాయితీగా నిబంధనల ప్రకారం పని చేసే ఐలయ్య లాంటి అధికారులకు తామెప్పుడూ అండగా ఉంటామన్న కేటీఆర్.

రెండు రోజుల కింద తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య ను మంత్రి కే.తారకరామారావు అభినందించారు.రాంగ్ రూట్ లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకుని మరి అభినందనలు తెలిపారు.

సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా….నిబంధనలు అందరికీ ఒకటే అని, ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.  ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో  తాను ఎల్లవేళల ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజు సైతం వాహనంలో తాను లేనని కేటీఆర్ అన్నారు.అయితే బాపు ఘాట్ లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్ లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్ లకు శాలువా కప్పి అభినందించిన మంత్రి,  విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకి ఎప్పుడూ తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.

మంత్రి కేటీఆర్ తన వాహనానికి విధించిన చలాన్ ను సైతం చెల్లించారు.ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తలు నాయకులకు సరైన సందేశం అందెందుకే ఈరోజు ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన విషయాన్ని,  పార్టీ శ్రేణులు గుర్తించాలని కేటీఆర్ అన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube