రష్మికపై ట్రోల్స్.. ఆ యాడ్ లో ఎలా చేసావంటూ..!

ప్రెసెంట్ సౌత్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు రష్మిక మందన్న.ఈ పేరు ఈ మధ్య బాగానే వినిపిస్తుంది.

 Rashmika Mandanna Vicky Kaushal Brutally Trolled For New Underwear Ad, Rashmika-TeluguStop.com

కేవలం టాలీవుడ్ లోనే కాకుండా అన్ని భాషల్లో రష్మిక నటిస్తూ దూసుకు పోతుంది.తెలుగులో ఛలో అనే చిన్న సినిమాతో జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరోలందరితో ఆడిపాడుతుంది.

మహేష్ బాబు తో అవకాశం అందుకున్న రష్మిక సూపర్ హిట్ కొట్టింది.

Telugu Vicky Kaushal-Movie

దీంతో సుకుమార్ పాన్ ఇండియా సినిమాలో అల్లు అర్జున్ సరసన అవకాశం లభించింది.ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో ఈ సినిమా రష్మిక కెరీర్ కు కూడా బాగా ఉపయోగ పడుతుంది.ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.

సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు.వీరందరూ కలిసి రశ్మికకు నేషనల్ క్రష్ అంటూ పిలుచు కుంటారు.

ఇక ఇంత స్టార్ డమ్ వచ్చిన తర్వాత హీరో కి కానీ హీరోయిన్స్ కు కానీ యాడ్స్ లో నటించే అవకాశం రావడం సహజం.ఇప్పటికే ఈ అమ్మడు కొన్ని యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే.

కానీ రష్మిక చేసిన ఒక యాడ్ వల్ల ఆమెను భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.తాజాగా ఆమె విక్కీ కౌశల్ తో కలిసి చేసిన ఒక యద వల్ల రష్మిక విమర్శల పాలవుతుంది.

Telugu Vicky Kaushal-Movie

ఈమె ఒక అండర్ వేర్ యాడ్ లో విక్కీ కౌశల్ తో కలిసి నటించింది.అయితే ఈ యాడ్ విషయంలో రష్మిక మందన్న ను నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.ఈ యాడ్ లో రష్మిక ఒక యోగ ఇన్ స్ట్రక్టర్ గా ఉండగా విక్కీ యోగా చేస్తూ కనిపించాడు.ఈ యాడ్ చూసిన నెటిజెన్స్ విమర్శలు చేస్తున్నారు.

ఇలాంటి చీప్ యాడ్ ఎప్పుడు చూడలేదని అసలు రష్మిక ఈ యాడ్ లో నటించేందుకు ఎలా ఒప్పుకుందని నెటిజెన్స్ రష్మిక పై ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube