బుల్లెట్టు బండి సాంగ్ ని రాసింది ఎవరో తెలుసా..?

మామూలుగా చలన చిత్ర పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్ మరియు అవకాశాలు మంచి కంటెంట్ వాటి వాటి అవసరం చాలా ఉంటుంది.కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో పాపులర్ కావడానికి కేవలం మంచి కంటెంట్ ఉంటే చాలు అయితే ఈ మధ్యకాలంలో కొందరు సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకుంటూ బాగానే పాపులర్ అవుతున్నారు.

 Bullet Bandi Song Lyric Writer Laxman Real Life, Bullet Bandi, Bullet Bandi Song-TeluguStop.com

ఈ క్రమంలో ఇటీవలె మలయాళీ సింగర్ పాడిన “మానికే మాగే హితే” అనే పాట ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది దీంతో కొందరు ఏకంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, తదితర భాషలలో ఈ పాటను అనువాదం చేస్తూ బాగానే పాపులర్ చేస్తున్నారు.

అయితే గత కొద్ది కాలంగా తెలుగులో ప్రముఖ సింగర్ “మోహన భోగరాజు” పాడిన బుల్లెట్ బండి సాంగ్ కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

అయితే ఈ పాట ని విడుదల చేసినా మొదట్లో పెద్దగా ప్రేక్షకులకి తెలియకపోవడంతో ఎవరు పట్టించుకోవడం లేదు కానీ క్రమక్రమంగా ఇంస్టాగ్రామ్ లో కొందరు రూల్స్ చేయడం మొదలు పెట్టడంతో ఈ పాట ఒక్కసారిగా పాపులర్ అయింది.అయితే ఈ పాట విడుదలైన రెండు నెలల్లో కనీసం పది మిలియన్ల కూడా రాలేదు.

కానీ వైరల్ అవ్వడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 9 కోట్ల కి పైగా వ్యూస్ వచ్చాయి.దీనికి తోడు ఆ మధ్య ఓ పెళ్లి కూతురు ఈ పాటకి డాన్స్ చేయడంతో మరింత వైరల్ అయింది.

అంతేకాకుండా ఈ పాటకి డాన్స్ వేసిన మెప్పించినందుకు కొత్త పెళ్ళి కూతురికి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశం కూడా లభించింది.అయితే ఇప్పటి వరకు ఈ పాట పాడిన మోహన భోగరాజును అందరూ గుర్తించారు.

కానీ ఈ పాటను రాసిన వ్యక్తి ఎవరనే విషయం మాత్రం దాదాపుగా చాలా మందికి తెలియదు.

Telugu Bullet Bandi, Bulletbandi-Movie

అయితే ఈ పాటను రచించిన వ్యక్తి పెద్దగా సెలబ్రిటీ కాకపోయినప్పటికీ దాదాపుగా 200కు పైగా పాటలను రచించాడు.ఇందులో దాదాపు 120 కి పైగా మంచి హిట్ అయ్యాయి.అయితే ఈ పాటను రచించిన వ్యక్తి పేరు లక్ష్మణ్.

ఇతడు పుట్టి పెరిగింది తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలంలో.లక్ష్మణ్ కి చిన్నప్పటి నుంచి పాటలపై మక్కువ ఎక్కువగా ఉండేది.

దీంతో అక్షరాలతో స్నేహం చేసి వాటిని ఒక చోటికి చేర్చి మంచి పాటలని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.ఈ క్రమంలో ఎన్నో అడ్డంకులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ తన లక్ష్యంపై దృష్టి సారించి ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు.

అయితే గతంలో తాను రాసిన ఓ పాటని చూసి ఇంప్రెస్ అయినటువంటి సింగర్ మోహన భోగరాజు లక్ష్మణ్ ని సంప్రదించి తనకు ఇష్టమైన బుల్లెట్ పాటని రచించమని అడగడంతో దాదాపుగా 3 వారాలు కష్ట పడి ఈ పాటను రచించినట్లు ఓ ప్రముఖ పత్రిక ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

అయితే చిన్నప్పటినుంచి తను పల్లెటూరు వాతావరణంలో పెరగడంతో పల్లెటూరు అమ్మాయిలు తాము పెళ్లి చేసుకునే అబ్బాయి గురించి ఎలాంటి కలలు కంటారు, అలాగే వారికి నచ్చిన జీవితం కోసం ఉండే చిన్నచిన్న ఆశలు వంటి వాటి ఆధారంగా బుల్లెట్ బండి పాట రాసినట్లు తెలిపాడు.

అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పెళ్లి భరాత్, గణేష్ మండపం, లేదా ఇతర వేడుకలు ఏదైనా సరే బుల్లెట్ బండి పాట మాత్రం కచ్చితంగా వినిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube