ఆ బ్రహ్మాస్త్రంతో బరిలోకి వై. ఎస్. షర్మిల...అదేంటంటే

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు రణ రంగంగా మారుతున్న పరిస్థితి ఉంది.గత 7 సంవత్సరాలుగా లేని హడావుడి ఇప్పుడు ప్రతిపక్షాలలో కనిపిస్తోంది.

 With That Brahmastra Sharmila Into The Ring. That Is, Ys Sharmila, Telangana Pol-TeluguStop.com

ఇప్పట్లో హుజురాబాద్ ఉప ఎన్నిక మినహా ఏ ఎన్నికలు దగ్గరలో లేవు.అయినప్పటికీ ప్రతి పక్షాలు చాలా వరకు ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే ఇక అసలు విషయం లోకి వస్తే వైఎస్ షర్మిల తెలంగాణాలో పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అయితే షర్మిల పార్టీ ఏర్పాటు చేసిన మొదట్లో పార్టీ నిర్మాణంపైనే దృష్టి సారించిన షర్మిల రాను రాను సమస్యలపై పోరాటం చేస్తూ వినూత్నమైన కార్యాచరణతో దీక్షల పేరుతో ఎంతో కొంత తన రాజకీయ ప్రయాణాన్ని విజయవంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది.

అయితే రేవంత్ రెడ్డి లాంటి నాయకులు షర్మిల పార్టీ ఒక ఎన్ జీవో సంస్థ అని, పార్టీని పెద్దగా సీరియస్ గా తీసుకోవద్దని మీడియాను విన్నవంచిన విషయం తెలిసిందే.ఈ కామెంట్ అప్పట్లో రాష్ట్ర రాజకీయాలలో హల్ చల్ గా మారింది.

అయితే షర్మిల రాను రాను తెలంగాణ రాజకీయాలలో క్రియా శీలకంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.అందుకు తగ్గ కార్యాచరణను కూడా ఏర్పాటు చేసుకుంటోంది.అయితే ఆంధ్రా వారి పాలనను వ్యతిరేకిస్తూ సాగిన తెలంగాణలో షర్మిల పార్టీని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనేది భవిష్యత్తులో చూడాల్సిన అంశం.అయితే షర్మిల ఆంధ్రా ప్రాంత వ్యక్తి అనే పేరు పోవాలని చెప్పి ఒక బ్రహ్మాస్త్రం తో షర్మిల మరింతగా రాజకీయంగా బరిలోకి దిగుతోంది.

వై.ఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటి వని తెలంగాణ అభివృద్ధికి రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులు బయటికి రాకుండా కొంత మంది నాయకులు అడ్డుకున్నారనే వ్యాఖ్యతో తన పార్టీ ఏర్పాటును, తన రాజకీయ ప్రయాణాన్ని షర్మిల సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube