బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో నుంచి తొలి వారం ఎలిమినేట్ కావడం ద్వారా సరయు వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లో బూతులు మాట్లాడటం వల్లే ఆమె ఎలిమినేట్ అయ్యారని చాలామంది భావిస్తారు.
యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సరయుకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.అయితే సరయు వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సరయు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఒక వ్యక్తితో తాను ఏకంగా ఏడు సంవత్సరాలు రిలేషన్ లో ఉన్నానని సరయు చెప్పుకొచ్చారు.
ఆ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాననే విషయం తన కుటుంబ సభ్యులతో పాటు అవతలి వ్యక్తి కుటుంబ సభ్యులకు సైతం తెలుసని సరయు వెల్లడించారు.తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా తాను ఏ పని చేయనని సరయు అన్నారు.

ప్రేమించిన వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో తను కెరీర్ ను కూడా పక్కన పెట్టానని సరయు చెప్పుకొచ్చారు.రిలేషన్ షిప్ లో అతడికి అన్నీ ఇచ్చేశానని అయితే తాను, అవతలి వ్యక్తి పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కుదరలేదని సరయు వెల్లడించారు.కట్నం విషయంలో తలెత్తిన వివాదం వల్ల వివాహం ఆగిపోయిందని ఆమె కామెంట్లు చేశారు.ప్రేమించిన వ్యక్తి మొదట పాతిక లక్షలు అడిగాడని ఆ తరువాత సగం ఆస్తి అడిగాడని ఆమె అన్నారు.