ఆ కాలంలోనే మేకర్స్ పబ్లిసిటీ ట్రిక్స్.. తెలిస్తే మీరు షాక్ అవుతారంతే..!

ప్రజెంట్ సినిమా థియేటర్స్‌లోకి ప్రేక్షకులను తీసుకొచ్చేందుకుగాను మేకర్స్ విశ్వప్రయత్నాలు చేస్తుండటం మనం చూడొచ్చు.ట్రైలర్స్, టీజర్స్ రిలీజ్ చేయడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కండక్ట్ చేసి తమ సినిమా ఈ సారి సిక్స్ కొట్టబోతుందంటూ ఊదరగొడుతుంటారు.

 Publicity Tricks In Movie Industry Early Days , Publicity Programs, Vasan Muruga-TeluguStop.com

అలా చేయడం ద్వారా జనాలను థియేటర్స్‌లోకి తీసుకెళ్లొచ్చనేది వారి అంచనా.అయితే, ఇలా పబ్లిసిటీ ప్రోగ్రామ్స్ కేవలం ఇప్పుడే ఉన్నాయని మీరు అనుకుంటే పొరపడినట్లే.

ఆ కాలంలోనే అనగా 1942లో జనాలను సినిమా బాట పట్టించేందుకు మేకర్స్ డిఫరెంట్ ట్రిక్స్ ప్లే చేశారు.ఇంతకీ ఆ సినిమా ఏమిటీ? వారు ప్లే చేసిన ట్రిక్ ఏమిటంటే.

చిత్రం పుట్టిన స్టార్టింగ్ డేస్‌లో అనగా 1942 వ సంవత్సరంలోనే మేకర్స్ యూనిక్ పబ్లిసిటీ ట్రిక్ ప్లే చేశారు.అప్పటికే విడుదలైన ‘భక్త నందనార్’ అనే తమిళ మూవీని జనాల్లోకి తీసుకెళ్లేందుకుగాను మేకర్స్ ప్రయోగమే చేశారు.

జెమిని బ్యానర్‌పై వాసన్ మురుగదాస్ నిర్మించిన ఈ సినిమాకు విశేషమైన ప్రేక్షక ఆదరణ లభించాలని మేకర్స్ అనుకున్నారు.ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ వాసన్ తమ సినిమాలోని 31 సాంగ్స్‌లో ఉత్తమమైన మూడు సాంగ్స్ ఎంపిక చేసి తమకు పంపాలని, అలా చేసిన వారికి ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటన ఇచ్చారు.

అంతే ఇక ప్రైజ్ మనీ కోసం జనాలు ఎగబడ్డారు.

థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసి పాటలు విని తమకు నచ్చిన పాటలు పంపారు.

ఇందుకు ప్రాసెస్ కూడా వెరీ సింపుల్‌గా ఉండేలా చేశారు.సినిమా థియేటర్ దగ్గర పాటల లిస్ట్ ప్రేక్షకులకు ఇచ్చి అందులో తమకు నచ్చిన మూడు పాటలను టిక్ చేయాలని సూచించారు.

ఆ తర్వాత వారు ఆ షీట్‌లను టాకీసు దగ్గర పెట్టిన బాక్స్‌లో వేశారు.అలా థియేటర్స్ హౌజ్ ఫుల్ అయి, సినిమా బ్రహ్మాండంగా ఆడింది.

మూవీ శతదినోత్సవం వరకు మార్కెట్‌లోకి పాటలను విడుదల చేయకపోవడం గమనార్హం.దాంతో పాటలు వినేందుకు జనం మళ్లీ మళ్లీ థియేటర్స్‌కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలా మార్కెటింగ్ ట్రిక్ ప్లే చేసి తమ సినిమాకు మంచి పబ్లిసిటీ తెచ్చుకున్నారు.ఇక టిక్స్ కొట్టిన స్లిప్స్‌ను సినీ పెద్దల సమక్షంలో మీడియాను పిలిచి లాటరీ నిర్వహించి ఇరవై మందిని సెలక్ట్ చేశారు.

వారికి చెరో రూ.పది వేలు ప్రైజ్ మనీ అందజేశారు.ఇటువంటి పబ్లిసిటీ ఇప్పటి వరకు మళ్లీ ఎవరు చేయలేకపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube