మట్టిలో మాణిక్యం.. కృషితో సివిల్స్‌లో ర్యాంకు సాధించిన వీధి వ్యాపారి బిడ్డ

అకుంఠిత దీక్ష, కృషి, పట్టుదల ఉంటే చాలు.ఎంతటి లక్ష్యాన్నైనా ఇట్టే ఛేదించొచ్చని నిరూపించాడు అనిల్ బోసక్.

 Ruby In The Mud The Child Of A Street Trader Who Has Achieved Rank In Civils Wit-TeluguStop.com

పేదరికం లక్ష్యాన్నికి అస్సలు అడ్డు కాదని నిరూపించాడు.దేశంలోనే ఉన్నతమైన కొలువులుగా భావించే సివిల్స్‌లో 45 వ ర్యాంకు సాధించాడు.

యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాలలో సత్తా చాటాడు.పేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి చదువుకుని తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాడు.

అతను ఎవరంటే. బిహార్‌లోని కిషన్ గంజ్ జిల్లాకు చెందిన అనిల్ బోసక్.

నిరుపేద కుటుంబంలో జన్మించిన అనిల్ సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అనిల్ ఫాదర్ బినోద్ బోసక్ సైకిల్ మీద వెళ్లి ఊరూరా తిరిగి బట్టలు అమ్ముతుంటాడు.

ఆయన సంపాదనతోనే వారి కుటుంబం గడిచింది.ఈ క్రమంలోనే తండ్రి కష్టాన్ని చిన్ననాటి నుంచి చూసిన అనిల్ మంచిగా చదువుకుని తండ్రి పేరు నిలబెట్టాడు.

ఇకపోతే తమ తనయుడు ఐఏఎస్ కాబోతున్నాడని తెలుసుకుని అనిల్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అనిల్ తండ్రి బినోద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అనిల్ ఐఐటీలో చదివి మంచి ఉద్యోగం చేస్తాడని భావించామని, కానీ, అనిల్ ఉద్యోగం చేయకుండా యూఎస్సీకి ప్రిపేరయ్యాడని తెలిపాడు.

అనిల్‌ను చదివించేందుకుగాను అతడి టీచర్ సాయం చేశారని గుర్తు చేశాడు.అనిల్ టీచర్స్ చాలా మంది అనిల్ ప్రిపరేషన్ కోసం ఆర్థిక సాయం చేశారని పేర్కొన్నాడు.

అనిల్ సివిల్స్‌కు సెలక్ట్ కావడం పట్ల అనిల్ సోదరుడు బాబుల్ బోసాక్ మాట్లాడారు.గతేడాది సివిల్స్‌లో అనిల్‌కు 616వ ర్యాంకు వచ్చిందని, ఈ సారి 45 వ ర్యాంకు వచ్చిందని చెప్పాడు.

మూడో సారి మంచి ర్యాంకు వచ్చిందని తెలిపాడు.అనిల్ విజయం తనకు ఇప్పటికీ కలగానే ఉందని, అయితే తన సోదరుడు సాధించిన సక్సెస్ పట్ల తాము గర్వపడుతున్నట్లు పేర్కొన్నాడు.

తమ ఫ్యామిలీ మాత్రమే కాకుండా జిల్లా మొత్తం గర్వపడేలా అనిల్ చేశాడని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube