ఎన్టీఆర్ ప్రశ్నతో సైలెంట్ అయిన అసోసియేట్ డైరెక్టర్..

విశ్వ విఖ్యాత నటుడు ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు నిర్మించిన సంస్థ శ్రీ వేంకటేశ్వర స్వామి ఫిల్మ్స్.ఈ సంస్థకు అధినేత మిద్దె జగన్నాథరావు.

 Ntr Shocking Answer To Associate Director , Sri Venkateswara Swamy Films, Ntr‌-TeluguStop.com

ఈ సంస్థ బ్యానర్ లో ఎన్టీఆర్ ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాడు.వాటిలో నిండు హృదయాలు, నిండు మనసులు, నిండు దంపతులు, కలిసొచ్చిన అదృష్టం సహా పలు సినిమాలు చేశాడు.

ఈ సినిమాల్లో నిండు హృదయాలు చిత్రం మంచి విజయం అందుకుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కిళ్లీ షాప్‌ ఓనర్ రాములు పాత్రలో నటించాడు.

ఆయనకు జోడీగా విజయ నిర్మల యాక్ట్ చేసింది.ఎన్టీఆర్ పాన్ షాప్ కు ఎదురుగా ఉన్న కాకా హోటల్ సుబ్బులు పాత్ర చేసింది విజయ నిర్మల.

ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా షూటింగ్ తొలి రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ ఘటనలు జరిగాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిండు హృదయాలు షూటింగ్‌ లో భాగంగా మేకప్ వేసుకుని సెట్ లోకి అడుగు పెట్టాడు ఎన్టీఆర్.పంచె, లాల్చీ, మెడలో టవల్, రెండు చేతులకు ఉంగరాలు పెట్టుకుని వచ్చాడు.

అయితే పాన్ షాప్ లు మరీ రిచ్ వ్యక్తులవి కాదు కాబట్టి.చేతులకు ఉంగరాలు ఉండకూడదు అని యూనిట్ సభ్యులు అనుకున్నారు.

సినిమా అసోసియేట్ దర్శకుడు కూడా ఇదే అనుకున్నాడు.ఈ విషయం గురించి దర్శకుడు విశ్వనాథ్ ను అడగకుండానే ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాడు.

సార్.ఈ సినిమాలో మీరు కిళ్లీ షాప్ ఓనర్ పాత్ర వేస్తున్నారు.

అందుకే రెండు చేతులకు ఉంగరాలు ఉండకూడదు అని చెప్పాడు.నిజానికి తన లాజిక్ ను ఎన్టీఆర్ అభినందిస్తాడు అనుకున్నాడు సదరు అసోసియేట్ దర్శకుడు.

కానీ అక్కడ సీన్ వేరేలా మారిపోయింది.

Telugu Associate, Vishwanath, Middejagannath, Nindu Hrudayalu, Ntr Associate, Sr

అటు ఈ అసోసియేటెడ్ దర్శకుడు తనకు కాస్త సన్నిహితుడు కావడంతో చాలా కూల్ గా సమాధానం చెప్పాడు ఎన్టీఆర్.మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్లి కిల్లీ షాప్ ఓనర్లను చూశారా? అని అడిగాడు.అందుకు లేదు అని చెప్పాడు.

వెళ్లి చూడండి.వారి చేతికి ఉంగరాలు ఉంటాయో? ఉండవో? అన్నాడు.ఈ సమాధానంతో అసోసియేట్‌ డైరెక్టర్‌ సైలెంట్ అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube