వార్ కు రెడీ అవుతున్న షర్మిల సైన్యం.,. షర్మిల టార్గెట్ ఇదే

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై మరింత ఫోకస్ పెట్టింది.ఇప్పటి వరకు దీక్షల పేరుతో విమర్శలకే పరిమితమైన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేస్తూ పాదయాత్ర నిర్వహిస్తూ, ఏమైనా ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు రెడీ అవుతోంది.

 Sharmila's Army Preparing For War This Is Sharmila's Target, Ys Sharmila, Telang-TeluguStop.com

అయితే తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేదని, ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రజల తరఫున పోరాడుతూ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని షర్మిల వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.ఇక రానున్న రోజుల్లో వార్ కు రెడీ అవుతోంది.

వైయస్ షర్మిల.క్షేత్రస్థాయిలో ఉన్న యువతరాన్ని పార్టీలో చేర్చుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ పెద్ద ఎత్తున షర్మిల సైన్యాన్ని పేరుతో పోరాటాలు నిరసనలు చేయడానికి సిద్ధమవుతోంది.

ప్రస్తుతం షర్మిల పార్టీని ప్రజలు ఆదరిస్తారా లేదా అనే ఈ విషయం పక్కన పెడితే, ప్రజలు తమ సమస్యలపై పోరాడే వారిని గుర్తిస్తారని ఆంధ్ర- తెలంగాణ అనే భేదం ప్రజల్లో ఉండదని షర్మిల పదే పదే చెబుతోంది.అయితే ఆంధ్రుల నాయకత్వాన్ని ప్రజలు ఈ పరిస్థితుల్లో అంగీకరించే పరిస్థితి ఉండదనేటటువంటిది సుస్పష్టం.

ఇప్పటికే తెలంగాణలోని రాజకీయ పార్టీలు షర్మిల పార్టీని అంగీకరించకపోయినా వీళ్ళ అంగీకరిస్తే చేతిలో మరల బలిపశువును అవుతామనే భావన అందరిలో ఉంది కావున ఇప్పటికైనా షర్మిల పోరాటం చేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అయితే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల రాజకీయంగా కీలకంగా ఉంటే క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ క్రియా శీలక రాజకీయాలలో ఉండనున్నారు.షర్మిల పార్టీని ఏ రాజకీయ పార్టీ గుర్తించే అవకాశం లేదు.

అంతేకాక షర్మిల పార్టీని సపోర్ట్ చేసే పరిస్థితి రావడం చాలా కష్టం.ఒకవేళ ఎవరైనా మద్దతివ్వడానికి ప్రయత్నించినా వారు చాలా విమర్శల పాలవడం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube