టీఆర్ఎస్ కీలక నాయకుల నియోజకవర్గాలపై బీజేపీ గురి... అసలు వ్యూహం ఇదే

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు వ్యూహం రచిస్తోంది.

 The Bjp Is Targeting The Constituencies Of Key Trs Leaders ... This Is The Real-TeluguStop.com

రెండో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలనుకునే బీజేపీ వ్యూహంలో భాగంగా టిఆర్ఎస్ లోని కీలక నేత నియోజకవర్గాల్లో బిజెపి ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కీలక నేత నియోజకవర్గాలలో సభలు ఏర్పాటు చేసి అక్కడున్న బిజెపి నేతలను కీలక నేతలుగా అభివర్ణిస్తూ, వారు బిజెపికి చేసిన సేవలను గుర్తు చేస్తోంది.

టీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించి టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి, స్థానిక కార్యకర్తలకు పెద్ద ఎత్తున భరోసా  కల్పిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తాజాగా కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చేరుకున్న బండి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వం పై కెసిఆర్ పై కెటీఆర్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

కీలక నేత నియోజకవర్గాల్లో బీజేపీ ప్రాబల్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతే వచ్చే ఎన్నికల వరకు ఇక్కడ బలమైన బిజెపి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యామ్నాయ పార్టీగా  తయారు చేయాలన్నది బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది.సిరిసిల్లలో పర్యటించినప్పుడు బండి సంజయ్ చేసిన విమర్శలపై కేసీఆర్ గాని టిఆర్ఎస్ నాయకులు కనీసం స్పందించలేదు.

అయితే బండి సంజయ్ సిరిసిల్లలో కేటీఆర్ పై కామెంట్ చేస్తే కేటీఆర్ స్పందిస్తారని భావించినప్పటికీ కేటీఆర్ స్పందించకపోవడంతో బిజెపి ప్లాన్ ఫెయిల్ ల్ అయింది.మరి తెలంగాణలో బిజెపి ఈ వ్యూహాన్ని ఎన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తుందనేది చూడాల్సి ఉంది.

అంతేకాక  ప్రస్తుతం బీజేపీ ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.అందులో భాగంగానే టీఆర్ఎస్ కీలక నేతల నియోజకవర్గాలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube