బీర్ల కంపెనీల‌కు రూ.873కోట్ల ఫైన్‌.. ఎందుకంటే..?

బీర్‌కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.ఇప్ప‌టి స‌మాజంలో దీని రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోనే ఉంది.

 Beer Companies Fined Rs 873 Crore .. Because .. Beer Companies, Fine , Beer Rats-TeluguStop.com

అయితే ఇప్పుడు బీర్ ధ‌ర‌ల‌కు కూడా రెక్క‌లు వ‌చ్చేస్తున్నాయి.ఈ క్ర‌మంలోనే కొన్ని కంపెనీలు కుమ్మ‌క్కియ‌పోయి బీర్ల ధ‌ర‌ల విష‌యంలో అక్ర‌మాలు జ‌రిపాయంటూ వాటిమీద ఏకంగా కోట్ల ఫైన్ విధించాయి.

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.మార్కెట్ రూల్స్‌కు విరుద్ధంగా ధరల విష‌యంలో అక్ర‌మాలు జ‌రిపారంటూ బీర్ల కంపెనీల మీద సీసీఐ సంస్థ కొర‌డా విధించింది.ఈ కంపెనీల మీద ఏకంగా ఏకంగా రూ.873కోట్ల ఫైన్ విధించింది.

ఈ ఫైన్ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కార్ల్స్ బ‌ర్గ్ ఇండియాతో పాటుగా ఆల్ ఇండియా బ్రూవర్స్ అసోసియేషన్ ల‌కు ఈ ఫైన్లు అమ‌లు చేస్తామంటూ తెలిపాయి.ఇక వీటితో పాటుగా కేంద్రపాలిత రాష్ట్రాల్లో ఉన్న‌టువంటి కొన్ని బీర్ల కంపెనీలపై ఈ నిర్ణ‌యం వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది సీసీఐ.

మొత్తం మూడు కంపెనీలకు ఈ ఫైన్ విధించామ‌ని తెలిపింది.యూబీఎల్ తో పాటుగా కార్ల్స్ బర్గ్ ఇండియాల కంపెనీల‌కు విధించిన పెనాల్టీ మొత్తం రూ.752కోట్లు అలాగే రూ.121కోట్లుగా ఉండలం సంచ‌ల‌నం రేపుతోంది.ఇక మూడో కంపెనీ అయిన సబ్ మైలర్స్ ఇండియా లిమిటెడ్ కు కూఐడా రూ.6.25లక్షలు పెనాల్టీ వేయ‌డం గ‌మ‌నార్హం.

Telugu Againast Rates, India Brovars, Beer, Ccci, Company Rates, Fine, Rates-Lat

ఈ మూడు కంపెనీల‌కు విధించిన పెనాల్టీని త్వ‌ర‌లోనే చెల్లించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది.ఇక డిమాండ్ అండ్ స‌ప్లై విష‌యంలో కూడా కొన్ని ప్ర‌త్యేక‌మైన రూల్స్‌ను విధించింది సీసీఐ.త్వ‌ర‌లోనే వీటిని అమల్లోకి తీసుకొచ్చే ప్ర‌త‌య్నంలో ప‌డింది సీసీఐ.

అయ‌తే బీర్ల‌ కంపెనీల విష‌యంలో ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మంచిదేనంటున్నారు మందుబాబులు.అప్పుడే త‌మ‌కు అధిక ధ‌ర‌ల‌కు అమ్మకుండా కంపెనీ రేట్ ప్ర‌కార‌మే అమ్ముతారంటూ చెబుతున్నారు.

ఇప్పుడు ఈ వార్త నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube