గ్లాస్ కోల్పోయిన జనసేన ! అయినా ఇబ్బంది లేదా ? 

జనసేన పార్టీ కి రాజకీయంగా మరో ఝలక్ తగిలింది.ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్న జనసేన ఇప్పుడిప్పుడే ఒక ట్రాక్ లో పడుతుంది.

 Janasena Party Careless About Symbol, Janasena, Tdp, Chandrababu, Jagan, Ysrcp,-TeluguStop.com

వరుసగా ఉద్యమాలు చేపడుతూ జనాల్లోకి వెళుతోంది.రాబోయే ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో బలం పెంచుకుని అధికార పార్టీ టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

ఈ స్పీడ్ ఈ విధంగా ఉండగానే, జనసేనకు మరో పెద్ద ఇబ్బంది వచ్చిపడింది.  తాజాగా ఎన్నికల సంఘం జాతీయ ప్రాంతీయ పార్టీల వివరాలను ప్రకటించింది.

అందులో టిడిపి వైసీపీలను ప్రాంతీయ పార్టీలు గానే ఎన్నికల సంఘం గుర్తించింది.
తమవి జాతీయ పార్టీలు అని జాతీయ కార్యదర్శులను,  జాతీయ అధ్యక్షులను ఈ రెండు పార్టీలు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.

ఇక జనసేన కు ప్రాంతీయ పార్టీ హోదా కూడా దక్కలేదు.  గుర్తింపు లేని పార్టీల జాబితా లో జనసేన చేరిపోయింది.దీని కారణంగా జనసేనకు కామన్ గుర్తుగా ఉన్న గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ అయిపోయింది.వాస్తవంగా ఎన్నికల సంఘం 2013 జారీ చేసిన నోటిఫికేషన్ లెక్కన చూసుకుంటే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం తెచ్చుకోవాలి.

అలాగే రెండు అసెంబ్లీ సీట్లను గెలుచుకోవాలి.కాకపోతే జనసేన కు 6 శాతం మాత్రమే ఓట్లు రావడం, ఒక అసెంబ్లీ స్థానం గెలవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది.

Telugu Central, Chandrababu, Glass Symbol, Jagan, Janasena, Janasenani, Pavan Ka

 తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన జనసైనికుల్లో నిరాశా, నిస్పృహలు కలిగిస్తున్నాయి.అయితే కాస్త ఊరటనిచ్చే అంశం కూడా జనసేన కు కనిపిస్తోంది.రాబోయే ఎన్నికల్లో తమకు కామన్ గా గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని ఈసీకి జనసేన దరఖాస్తు చేసుకుంటే,  ఆ గుర్తు కేటాయించే అవకాశం ఉంది.అప్పుడు ఇతరులకు కేటాయించే అవకాశం ఉండదు.

ఇదొక్కటే ప్రస్తుతానికి జనసేన కు ఊరట కలిగించే అంశం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube