యూకే: పార్లమెంట్ సిబ్బందిపై వేధింపులు.. చిక్కుల్లో భారత సంతతి మాజీ ఎంపీ

భారత సంతతికి చెందిన మాజీ బ్రిటీష్ ఎంపీ చిక్కుల్లో పడ్డారు.పార్లమెంట్ సిబ్బందిని ఆయన వేధించినట్లుగా ప్యానెల్ విచారణలో తేలింది.

 Uk Panel Finds Indian-origin Ex-mp Keith Vaz Bullied Former Parliamentary Staff-TeluguStop.com

యూకే పార్లమెంట్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన భారత సంతతి ఎంపీలలో ఒకరైన కీసెస్ వాజ్ లీసెస్టర్ నుంచి లేబర్ పార్టీ తరపున పలుమార్లు బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలో గురువారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో పనిచేసిన సిబ్బంది ఒకరు వాజ్‌పై ఆరోపణలు చేశారు.

64 ఏళ్ల వాజ్.ఈ ఆరోపణలను ఖండించారు.

దీనిపై న్యాయపరంగా ఎదుర్కోవాలని ఆయన భావిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం హౌస్ ఆఫ్ కామన్స్ నిబంధనల ప్రకారం ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ (ఐఈపీ) విచారణలో వుంది.

తన నివేదికలో ఐఈపీ.పార్లమెంట్ వ్యవహారాల కమిటీ ఛైర్‌గా వాజ్ వ్యవహరిస్తున్న సమయంలో ఆయన సిబ్బందిని వేధించినట్లుగా తెలిపింది.

ఈ తరహా ప్రవర్తన పట్ల వాజ్ సిగ్గుపడాలని ఐఈపీ కమిటీ తన నివేదికలో వ్యాఖ్యానించింది.మాజీ పార్లమెంట్ సభ్యుడిగా వాజ్‌కు హౌస్ ఆఫ్ కామన్స్‌ సమావేశాలకు హాజరయ్యే పాస్ వుంటే గనుక.దానిని రద్దు చేయాలని ప్యానెల్ సిఫారసు చేసింది.

2007 జూలై – 2008 అక్టోబర్ మధ్య హౌస్ ఆఫ్ కామన్స్‌లో గుమస్తాగా పనిచేసిన మెక్‌కల్లౌ‌ను వాజ్ వేధించినట్లు ఫిర్యాదు అందింది.ఫిర్యాదు అనంతరం మెక్‌కల్లౌ హౌస్ ఆఫ్ కామన్స్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారని ప్యానెల్ తెలిపింది.మరోవైపు వాజ్ సన్నిహిత వర్గాలు అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీతో మాట్లాడుతూ.

ఈ నివేదికను ఆయన ఎన్నడూ చూడలేదన్నారు.సాక్షులను ప్రశ్నించే లేదా ప్రతిస్పందనను అందించే అవకాశం కూడా వాజ్‌కు ఇవ్వలేదని వారు తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పక్షవాతంతో బాధపడ్డారని పేర్కొన్నారు.ప్రస్తుతం వాజ్ ఆసుపత్రిలో వున్నారని.

ఇంకా చికిత్స పొందుతున్నారని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube