ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రాజేంద్ర ప్రసాద్.. కారణం?

సినిమాల్లో నటించాలంటే బ్యాక్‌గ్రౌండ్‌లో గాడ్ ఫాదర్‌ అయినా ఉండాలి, లేదా ఏదైనా ఫిల్మ్ ఇన్సిట్యూట్‌లో శిక్షణైనా పొంది ఉండాలని చాలా మంది చెప్తుంటారు.కానీ ఆ రెండూ ఉండి కూడా అవకాశాలు దొరక్క, తినడానికి తిండి లేక, మూడు రోజులు పాటు ఆకలితో అలమటించి కేవలం అరటిపండ్లు, మంచి నీళ్లతో కాలం గడిపి, చివరికి చేసేదేం లేక జీవితం మీద విసుగెత్తిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకొని, ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి చేరుకున్న నటుడు ఎవరో తెలుసా ? ఆయనే ప్రముఖ నటుడు, కమెడియన్ రాజేంద్ర ప్రసాద్.

 Actor Rajendra Prasad Wants To Commit Suicide Details, Rajendra Prasad, Suicide,-TeluguStop.com

సుపరిచిత నటుడు రాజేంద్ర ప్రసాద్ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులకు ఓర్చి ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నారంటే కారణం ఆయన నిరంతర కృషి, పట్టుదల.నందమూరి తారకరామారావు ఇంట్లోనే పుట్టి, పెరిగిన ఈయన, ఆయన్ని గాడ్ ఫాదర్‌గా భావిస్తారు.

ఇంజినీరింగ్‌లో విద్యనభ్యసించినా నటనపై ఉన్న ఆసక్తితో ముంబైలో శిక్షణ కూడా తీసుకున్నారు.

ఇదిలా ఉండగా తనకు మంచి అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.

కానీ రాజేంద్ర ప్రసాద్‌ ఎంత ప్రయత్నించినా అవకాశం ఇచ్చేందుకు ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదు.అప్పుడు ఎన్టీఆర్‌ను కలవగా.“నువ్వు చిన్న పాత్రలకు పెద్దగానూ, పెద్దపాత్రలకు చిన్నగానూ కనిపిస్తున్నావు.కాబట్టి నటనలో ఇంకా ఇంప్రూవ్‌ చేసుకుని కొంతకాలం తర్వాత ప్రయత్నించు” అని ఆయన అన్నారట.

Telugu Commit, Artist, Rajendra Prasad, Melukolupu, Rajendraprasad, Senior Ntr,

దీంతో అప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన రాజేంద్రప్రసాద్.ఇక ఆత్మహత్యే శరణ్యం అని నిశ్చయించుకున్నారట.ఇక చివరిసారిగా తనకు తెలిసిన వాళ్లందరినీ కలుద్దామని బయలుదేరారు.అప్పుడే పుండరీకాక్షయ్యను కలిసారు.ఆయన ఎన్టీఆర్‌కు కూడా బాగా పరిచయస్థుడు.అప్పుడు ఆయన తెలుగులో మేలుకొలుపు అనే సినిమాను నిర్మిస్తున్నారు.

ఆ చిత్రంలో నటించే తమిళ హారోకు డబ్బింగ్ చెప్పడానికి ఎవరి వాయిస్ సూట్ కావట్లేదు.అప్పుడు అక్కడికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్‌ను చూడగానే ఈయనతో ఒకసారి ప్రయత్నిస్తే బాగుంటుందని భావించి, వెంటనే రికార్డింగ్ థియేటర్‌కు తీసుకెళ్లారట.

దానికి రాజేంద్ర ప్రసాద్ వాయిస్ చెప్పేసరికి బాగా సెట్టయిందట.

Telugu Commit, Artist, Rajendra Prasad, Melukolupu, Rajendraprasad, Senior Ntr,

పక్కనే ఈయన్ని పెట్టుకొని దీనికోసం ఇన్ని రోజులు ఎక్కడెక్కడో వెతికామని ఆయన అన్నారట.ఈ సినిమా మొత్తం నువ్వే డబ్బింగ్ చెప్పాలని అనడంతో.రాజేంద్ర ప్రసాద్ బోరున ఏడ్చారట.

భోజనం చేసి మూడు రోజులవుతుంది.వెంటనే తనకు ఆ ఏర్పాటు చేయండని అన్నారట.

దానికి పుండరీకాక్షయ్య ఆశ్చర్యపోయి.ఏంటీ.

ఎందుకలా.అని అడిగి ఆయనకు భోజనం పెట్టించారట.

ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్‌ను తన సమస్యలు అడిగి తెలుసుకొని, ఏం బాధపడకు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారట.

అలా ఆత్మహత్య చేసుకోవాలనుకొని.

డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌ మొదలుపెట్టి.నటుడిగా, కమెడియన్ వివిధ పాత్రలలో ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నారంటే.

రాజేంద్ర ప్రసాద్ రియల్లీ గ్రేట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube