ఈ మధ్య భార్యాభర్తలు విడిపోయేందుకు పెద్ద కారణాలు కూడా ఉండట్లేదు.వారు చెప్పే కారణాలు వింటే నవ్వు వొచ్చాలా ఉంటున్నాయి.
ఇంకొందరి విషయంలో అయితే ఇదెక్కడి దారుణంరా బాబు అనిపించేలా కూడా ఉంటున్నాయి.ఇంకొన్ని అయితే ఎంతో భయంకరమైన కారణాలు కూడా ఉంటున్నాయి.
ఇక ఇప్పుడు ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కావాలంటూ కోర్టు తలుపు తట్టాడు.కాగా ఇందుకు ఆయన చెప్పిన కారణాలు మాత్రం చాలా విచిత్ంరగా ఉన్నాయి.
అదేంటంటే ఆయన భార్య ప్రతిరోజూ స్నానం చేయట్లేదని తనకు ఇబ్బంది అవుతోందని చెప్పారు.
దీంతో అందరూ షాక్ అయిపోయారు.
ఈ షాకింగ్ ఘటన యూపీలోని అలీఘర్ లో కోర్టులో చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళ్తే క్వార్సీ గ్రామంలో నివాసం ఉండే మహిళకు అలాగే ఈ ఊరికి దగ్గరలోనే ఉండే చందౌస్ గ్రామంలో ఉంటున్న మరో వ్యక్తికి రెండేళ్ల క్రితం పెండ్లి బాగానే ఉంటున్నారు ఇద్దరూ కలిసి.
కాగా వీరి సంసారంలో భాగంగా ఏడాది కూతురు కూడా ఉంది.అయితే తన భార్య రోజూ స్నానం చేయకపోవడంతో తనకు ఇబ్బంది అవుతోందని, ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే మాత్రం గొడవ పడుతుందని చెప్పడం గమనార్హం.
ఇక భర్తకు వ్యతిరేకంగా ఆయన భార్య కూడా న్యాయపోరాటానికి దిగింది.ఇందులో భాగంగా ఆమె ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో కంప్లయింటు కూడా చేసింది.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మహిళ మాత్రం విడాకులు తీసుకోవడం ముందుకు రావట్లేదు.తనకు విడిపోవడం ఇష్టం లేదని వివాహబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నానని చెబుతోంది.ఇక ఇద్దరికీ కూడా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలర్ కౌన్సిలింగ్ ఇచ్చి కలుపుతామంటూ చెబుతున్నారు.కానీ భర్త మాత్రం అవేమీ పట్టించుకోకుండా తనకు విడాకులు కావాలని పట్టుబడుతున్నారు.
చూడాలి మరి ఏం జరుగుతుందో.