ప‌స‌లేని ఆరోప‌ణ‌లు చేస్తున్న టీడీపీ.. ఇలా అయితే ఎలా..?

ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీ ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇలాంట‌ప్పుడు ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని పొందేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది.

 Tdp Making Baseless Allegations If So How , Tdp, Ap Politics-TeluguStop.com

కానీ టీడీపీ మాత్రం అలాంటి ప‌ని చేయ‌కుండా ఎంత సేపు ప‌స‌లేని ఆరోప‌న‌లు చేస్తూ ముందుకు సాగుతోంది.దీంతో ప్ర‌జ‌ల్లో మ‌రింత బ‌ల‌హీన ప‌డుతోంది.

ఇక ఇప్పుడు మ‌రో విష‌యంపై ఇలాగే ప‌స‌లేని ఆరోప‌ణ‌లు చేసి న‌మ్మ‌కాన్ని పోగొట్టుకుంటోంది.అదేంటంటే రీసెంట్ గా గుజరాత్ లోని ముంద్రా పోర్టులో వేల‌కోట్ల విలువైన హెరాయిన్ ప‌ట్టుబ‌డిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

అయితే దీన్ని కూడా రాజీకీయం చేసేస్తోంది టీడీపీ పార్టీ.బుద్ధా వెంకన్న రీసెంట్ గా మాట్లాడుతు అస‌లు ఆ హెరాయిన్ గుజరాత్ లో వేల‌వోట్ల విలువైంది పట్టుబడ్డా కూడా ప్ర‌భుత్ం స్పందించటంలేదని, దీని వెన‌క ఉన్న కార‌ణ‌మేంటో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఆయ‌న‌కంటే ముందే చంద్ర‌బాబు అండ్ కో కూడా ఇలాగే హెరాయిన్ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వాన్నిఇరికించేందుకు ప్ర‌య‌త్నించాయి.కానీ ఇందులో పెద్ద‌గా ఏపీలో హెరాయిన్ బిజినెస్ జ‌రుగుత‌న్న‌ట్టు ఎలాంటి ఆధారాలు లేవ‌ని కొట్టిపారేస్తున్నారు.

Telugu Ap, Tdp Baseless-Telugu Political News

ప‌ట్టుబ‌డ్డ హెరాయిన్ కన్సైన్ మెంట్ విష‌యంలో ఆంధ్రాకు చెందిన‌టువంటి విజయవాడ అడ్రస్ ఉంది కాబ‌ట్టి దాన్ని ఆధారంగా చేసుకుని చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారు.ఒక సాధార‌ణ కార్య‌క‌ర్త చేసిన‌ట్టు ఆరోప‌న‌లు చేస్తున్నారు.ఇక్క‌డ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా అంటూ కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.ఇక ఈ విష‌యంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు.హెరాయిన్‌తో ఏపీకి ఎలాంటి సంబంధాలు లేవంటూ చెప్పేశారు.దీంతో టీడీపీకి మ‌ళ్లీ షాక్ త‌గిలి న‌ట్టు అయింది.

ఇప్ప‌టికైనా ఇలాంటి ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేయ‌డం మానేసి ఏదైనా జ‌నాల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా పోరాడాల‌ని తెలుగు త‌మ్ముళ్లు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube