అప్పుడే బెయిల్‌.. అప్పుడే అరెస్ట్‌.. తీన్మార్ మ‌ల్ల‌న్న విష‌యంలో ఏం జ‌రుగుతోంది..?

తెలంగాణ‌లో చాలా చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.మ‌రీ ముఖ్యంగా ప్ర‌శ్నించే గ‌లంగా పేరు తెచ్చుకున్న తీన్మార్ మ‌ల్ల‌న్న విష‌యంలో ఇలాగే జ‌రుగుతోంది.

 Then Bail Then Arrest What Is Happening In The Case Of Teen Mar Mallanna , Malla-TeluguStop.com

ఇప్పుడు జ‌రుగుత‌న్న ప‌రిస్థితుల‌ను చూస్తుంటే అస‌లుఇప్ప‌ట్లో మల్లన్న విడుదలయ్యే పరిస్థితి లేద‌ని తెలుస్తోంది.మ‌ల్ల‌న్న‌ను ఓ జ్యోతిష్యుడిని రూ.30 లక్షలకు బ్లాక్ మెయిల్ చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై అరెస్ట్ చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.అయితే ఆయ‌న నిన్న బెయిల్ మీద ఇలా బయటకు వచ్చారో లేదో మ‌ల్లీ ఆయ‌న‌కు పోలీసులు షాక్ ఇచ్చేశారు.

ఈ సారి మ‌రో కేసు అంటూ ఆయ‌న్ను మళ్లీ అరెస్ట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇదేం ట్విస్టు అంటూ అంద‌రూ షాక్ అయిపోతున్నారు.ఇక ఈ కొత్త కేసు విష‌యంలో కోర్టు కూడా ఆయ‌న‌కు మ‌రో 14 రోజుల రిమాండ్ విధించడం పెను ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.కేసీఆర్ సర్కార్ ను ఎప్ప‌టి నుంచో తీన్మార్ మ‌ల్ల‌న్న టార్గెట్ చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఆయ‌న సొంత ఛానెల్ ‘క్యూ న్యూస్’ ద్వారా సాగిస్తున్న క్రిటిసిజం ఎంత పాపులరో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఆయ‌న ఇందులో ఎవ‌రినైనా సూటిగే ప్ర‌శ్నించే త‌త్వం అంద‌రికీ న‌చ్చుతుంది.

అయితే చాలా రోజుల నుంచే తీన్మార్ మ‌ల్ల‌న్న‌మీద కేసులు ఉన్నా కూడా ఆయ‌న మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు జైలుకు వెళ్ల‌ట్లేదు.కానీ ఇప్పుడు వ‌రుస‌బెట్టి ఆయ‌న్ను జైలులు పెట్ట‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

వరుస కేసులతో అరెస్ట్ ల మీద అరెస్ట్ లు ఆయ‌న్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఇప్పుడేమో నిజామాబాద్ జిల్లాలో ఓ కల్లు వ్యాపారి ద‌గ్గ‌రి నుంచి మల్లన్న పేరు మీద ఆయ‌న‌కు చెందిన‌టువంటి మ‌ల్ల‌న్న టీమ్ స‌భ్యులు డబ్బులు డిమాండ్ చేశార‌నే కేసు విష‌యంలో ఆయ‌న్ను మ‌ళ్లీ అరెస్టు చేశారు.

ఈ సారి కూడా ఆయ‌న్ను చంచల్ గూడ జైలుకు త‌ర‌లించ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube