మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.మహానటి సినిమాలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం డైరెక్ట్ తెలుగులో దుల్కర్ సినిమా వస్తుంది.స్వప్న సినిమాస్ బ్యానర్ లో హను రాఘవపుడి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది.
సినిమాలో హీరోయిన్ గా మృణాల్ నటిస్తుండగా మరో స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న కూడా స్పెషల్ రోల్ చేస్తుందని అంటున్నారు.
సినిమాలో రష్మికది చాలా చిన్న పాత్రే అయినా సినిమాకు అది చాలా అవసరం అని తెలుస్తుంది.అందుకే స్టార్ హీరోయిన్ ను ఆ రోల్ కోసం తీసుకున్నారని తెలుస్తుంది.
స్వప్న సినిమాస్ లో సినిమా అంటే కచ్చితంగా ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది.జాతిరత్నాలు తర్వాత ఈ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఇక డైరక్టర్ గా కెరియర్ లో సక్సెస్ లు లేని హను రాఘవపుడి దుల్కర్ సల్మాన్ తో పాన్ ఇండియా సినిమా చేయడం విశేషం. ఈ సినిమా విషయంలో చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.