జార్జ్‌ఫ్లాయిడ్ కేసు: హత్యా నేరారోపణలపై అప్పీల్ చేసుకున్న పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్

యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేయడంతో పాటు సమాజంలో వున్న జాతి, వర్ణ వివక్షలపై మరోసారి చర్చను లెవనెత్తిన నల్లజాతీయుడు ‘‘జార్జ్ ఫ్లాయిడ్’’ హత్య కేసులో శ్వేతజాతి పోలీస్ అధికారి డెరిక్ చౌవిన్‌కు కోర్ట్ 22.5 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మిన్నియాపోలిస్ కోర్ట్‌ ఈ ఏడాది ఏప్రిల్ 20న తుది తీర్పు వెలువరించింది.ఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్‌ను దోషిగా తేల్చింది.

 Ex Us Cop Derek Chauvin Convicted Of Geroge Floyds Murder Files Appeal , Derrick-TeluguStop.com

న్యాయస్థానం తీర్పుపై ఫ్లాయిడ్ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ రోజు మేం మళ్లీ శ్వాస తీసుకోగలమని ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనైస్ ఆ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు.

అయితే ఫ్లాయిడ్ హత్యకు కారణమైన మిన్నియాపోలీస్‌కు చెందిన మాజీ పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ తనపై మోపిన హత్యా నేరారోపణలపై అప్పీల్ చేసుకున్నాడు.ఈ మేరకు మిన్నెసోటా జిల్లా కోర్టులో గురువారం రాత్రి అప్పీల్ పిటిషన్ దాఖలు చేశాడు.

విచారణను వాయిదా వేయడం, అభ్యర్ధనను తిరస్కరించడం, జ్యూరీని సీక్వెస్టర్ చేయడానికి నిరాకరించడం ద్వారా కోర్టు తన విచక్షణను దుర్వినియోగం చేసిందని డెరెక్ ఆరోపిస్తున్నాడు.అంతేకాదు.తనకు ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేదని.అలాగే అప్పీల్ ప్రక్రియలో చట్టపరమైన ప్రాతినిధ్యం లేదని చెప్పాడు.

విచారణ సమయంలో అతనికి న్యాయపరమైన ఖర్చుల కోసం చెల్లించిన రక్షణ నిధిని కోర్టు శిక్ష విధించిన తర్వాత రద్దు చేశారు.తాజా అప్పీల్‌కు సంబంధించి డెరెక్ ఆరువారాల విచారణకు హాజరయ్యాడు.

ఇదే సమయంలో తనపై నేరారోపణకు సంబంధించి ఐదవ సవరణ హక్కును ఉపయోగించుకున్నట్లు తెలిపాడు.

ఈ సందర్భంగా డెరెక్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.

తన క్లైయింట్ .ఘటన జరిగిన సమయంలో నిబంధనలను అనుసరించారని వాదించారు.పరిమితికి మించి డ్రగ్స్ వినియోగం వల్లే ఫ్లాయిడ్ మరణించాడని కోర్టుకు తెలిపారు.అయితే ఏప్రిల్‌లో జరిగిన విచారణ ముగింపు సమయంలో.చౌవిన్‌ను దోషిగా నిర్ధారించడానికి 10 గంటల కంటే తక్కువ సమయమే పట్టింది.డెరెక్ మూడు ఆరోపణలపై దోషిగా తేలాడు.

కాగా, ఘటన సమయంలో అతని పక్కనే వున్న ముగ్గురు పోలీసు అధికారులు సైతం ఫ్లాయిడ్ మరణంలో వారి ప్రమేయంపై వచ్చే ఏడాది విచారణను ఎదుర్కొనున్నారు.

Telugu Derrick Chauin, Copderek, George Floyd, Minneapolis, Philonise, Jury, Min

కాగా, అమెరికాలోని మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతి వ్యక్తి పోలీసులు అరెస్టు చేస్తుండగా చనిపోయిన సంగతి తెలిసిందే.2020 మే 25న జరిగిన ఈ ఘటన కారణంగా అమెరికాలోని అనేక నగరాలు రగిలిపోయాయి.ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతని ఊపిరాడక మరణించాడు.

‘‘ తనకు ఊపిరాడటం లేదని’’ ఫ్లాయిడ్‌ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్లు వైరల్ అయిన వీడియోలలో ఉంది.ఈ క్రమంలో జార్జ్‌ఫ్లాయిడ్ ఆక్సిజన్ అందకే మరణించాడని వైద్యుడు తెలిపారు.

వివాదాస్పద పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ మోకాలు అతని మెడపై ఉండటం వల్ల అతను ఊపిరి ఆడక ప్రాణాలు వదిలాడని ఆయన వాంగ్మూలం ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube