రేవంత్ ప్రతిపక్షాల నిరసన వెనుక ఉన్న అసలు వ్యూహం ఇదే

రాజకీయాలలో ప్రతి ఒక్క పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది.వారి వారి వ్యూహాలను బలంగా నమ్మి పోరాటాల రూపంలో అమలు పరుస్తారు.

 This Is The Real Strategy Behind The Rewanth Opposition Protest  Congress Party,-TeluguStop.com

అయితే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించాలనుకోవడం అనేది రాజకీయాలలో షరా మామూలే.కాని వారిని ఏ పార్టీ ఎంత మోతాదులో తీసుకుంటుందనేది అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి డిసైడ్ అయి ఉంటుంది.

అయితే ఇతర పార్టీలు చాలా రకాలుగా ప్రచారం చేస్తాయి.ఇవన్నీ రాజకీయాలలో సహజమే అయినప్పటికీ రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ ను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది.

అయితే ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ జాతీయ నాయకులతో సభలు నిర్వహించడం, పాదయాత్రలతో ప్రజల్లో ఉంటున్న సందర్భంలో బీజేపీ వ్యతిరేక పక్షాలు జతకట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే ప్రజల దృష్టిలో పెద్ద ఎత్తున సమస్యలపై పోరాడుతున్న పార్టీగా పేరు తెచ్చుకొని ఉండే అవకాశం ఉంది.

అంతేకాక అయితే చివరి వరకు ఒక్కటిగా ఉంటాయా లేక ఎజెండాల ఆధారంగా కలుస్తాయా అన్నది భవిష్యత్తులో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే నిన్న ప్రతిపక్షాల నిరసన సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ పరోక్షంగా కాంగ్రెస్ పై కూడా సెటైర్ లు వేసిన పరిస్థితి ఉంది.నారాయణ చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న విషయంలోనూ అదే విధంగా ఆర్థిక నేరాలు చేసి దేశం విడిచి పారిపోయిన వారు ఉన్నారని, కాని కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేసినా వారు పారిపోకుండా జైళ్ళలో ఉన్నారని కాంగ్రెస్ న్యాకుల ముందే అనడం అక్కడున్న వారిని కొద్దిగా షాక్ కు గురిచేసింది.

ఏది ఏమైనా ప్రతిపక్షాల నిరసన చాలా రకాల ప్రశ్నలను రేకెత్తిచ్చిందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube