మైక్రోసాఫ్ట్ నుంచి విడుదల కాబోయే కొత్త సర్ఫేస్ ప్రోడక్స్ ఇవే..!

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ తన సర్ఫేస్‌ శ్రేణిలో విభిన్న రకాలు అయిన సర్ఫేస్‌ ప్రో 8, సర్ఫేస్‌ ప్రో X, సర్ఫేస్‌ డ్యూ 2, పేరులతో కొత్త ప్రొడక్టులను రిలీజ్ చేయనుంది.మైక్రోసాఫ్ట్ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ పై పనిచేసే ఆధునిక్స్ గ్యాడ్జెట్లకు సర్ఫేస్‌ అని మైక్రోసాఫ్ట్ సంస్థ పేరు పెట్టింది.

 New Surface Products To Be Released By Microsoft Microsoft, New Features, New-TeluguStop.com

మంచి టచ్ స్క్రీన్, 2 ఇన్‌ 1 డిటాచబుల్‌ నోట్‌బుక్స్, ఆల్‌ ఇన్‌ వన్‌ డెస్క్‌టాప్‌ వంటి కొత్త కొత్త ఫీచర్లు మైక్రోసాఫ్ట్ సర్ఫేస్‌ సొంతం అని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ కొన్ని కొత్త ప్రొడక్ట్స్ ను లాంచ్ చేసేందుకు సిద్ధం అవుతుంది.

మరి ఆ ప్రొడక్ట్స్ ఏంటి వాటి ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సర్ఫేస్‌ సిరీస్‌ లో సర్ఫేస్‌ ప్రో8 అనే పేరుతో సరికొత్త ల్యాప్టాప్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇది 13 ఇంచ్‌ పిక్సెల్‌ సెన్స్‌ టచ్‌ స్క్రీన్‌ తో మనకు అందుబాటులో ఉంటుంది. అలాగే 32gb వరకు ర్యామ్‌ కలిగి ఉంటుంది.ఈ గ్యాడ్జెట్‌ ఇంటెల్‌ 11వ జనరేషన్‌ ప్రాసెసర్‌ తో నడుస్తుంది. అలాగే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ నుంచి రాబోతున్న మరో ప్రోడక్ట్ సర్ఫేస్‌ ప్రోX.

అయితే దీనికి కొత్తగా ఎటువంటి హార్డ్‌వేర్‌ జోడించలేదు.కాని ఇది కేవలం వై-ఫై మోడల్‌ పై మాత్రమే పనిచేసేస్తుందని తెలిపింది మైక్రోసాఫ్ట్.

ఈ కారణం వలన ఈ ప్రోడక్ట్ ప్రారంభ ధర $100 తగ్గుతుందట.అలాగే మైక్రోసాఫ్ట్ యొక్క మరొక కొత్త ప్రోడక్ట్ సర్ఫేస్‌ డ్యుయో 2.

దీనికి ముందే సర్ఫేస్ డ్యూయె రిలీజ్ అయినా కొన్ని లోపాలు ఉండడం వలన ఇప్పుడు ఆ సూక్ష్మ లోపాలను ఇప్పుడు సర్ఫేస్‌ డ్యుయో 2 పూరించింది.

Telugu Microsoft, Products-Latest News - Telugu

అలాగే పాత మోడల్ కంటే ఈ మోడల్ చూడడానికి కొంచెం స్లిమ్‌గా సన్నగా ఉంటుందట.ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 8gb ర్యామ్‌ తో కూడిన డివైస్‌ ఇది.స్నాప్‌ డ్రాగన్‌ 888 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ తో ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది.మైక్రోసాఫ్ట్ నుంచి సర్ఫేస్‌ గో 3 అనే ప్రోడక్ట్ ను మైక్రో సాఫ్ట్ లోనే అతి చిన్న 2 ఇన్‌ 1 డివైజ్ గాగో 3 మోడల్‌ ను అభివర్ణించవచ్చు.గో 3 కూడా కొత్తగా అప్ గ్రేడ్ అయ్యిందనే చెప్పాలి.

ఇందులో ఇప్పుడు గోల్డ్ 6500Y అనే ప్రాసెసర్‌ తో పాటు టెన్త్ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ3 కూడా అందుబాటులో ఉంచడంతో గతంలో మాదిరిగా కాకుండా గో ఇప్పుడు 60% వేగంగా పనిచేస్తుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube