టీఆర్ఎస్- బీజేపీ మైత్రిపై అనధికారిక సంకేతాలు వచ్చినట్టేనా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న విషయం అందరికి తెలిసిందే.రాజకీయ నాయకుల మధ్య వైరం సిద్దాంతాల వరకు, ప్రభుత్వం విధానాల వరకు ఉంటాయి తప్ప ఇక ఒకరికొకరు శాశ్వతంగా ద్వేషించుకొనే పరిస్థితి ఉండదు.

 Are There Any Unofficial Signals On The Trs Bjp Alliance, Telangana Politics, Bj-TeluguStop.com

అయితే ఇక ఎన్నికల వరకు వచ్చే సరికి ఎన్నికలు ముందు వరికు బద్ద శత్రువులు ఉన్నవారైనా ఎన్నికల సమయంలో జత కట్టి పోటీకి దిగుతారు.కాని క్షేత్ర స్థాయి కార్యకర్తలు మాత్రం అంత తొందరగా కలవడం అనేది చాలా అరుదు.

ఎందుకంటే క్షేత్ర స్థాయి నాయకులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చాలా సీరియస్ గా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటారు.కొన్ని కొన్ని సార్లు గొడవలు పడి ప్రాణాల మీదికి తెచ్చుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

ఇక అసలు విషయంలోకి వస్తే తెలంగాణలో భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి పోటీ చేయబోతున్నాయని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ కాని, బీజేపీ గాని పెద్దగా ఖండించని పరిస్థితి ఉంది.దీంతో ఇరు పార్టీలు కూడా ఖండించకపోవడంతో పలు అనుమానాలకు దారి తీస్తున్న పరిస్థితి ఉంది.

ఇప్పట్లో దగ్గరలో ఎన్నికలు కూడా లేనందున కేసీఆర్ స్పందించే అవకాశం లేదు.అసలు ఆ దిశగా దృష్టి సారించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Telugu @bjp4telangana, @trspartyonline, Bandi Sanjay, Bjp, Cm Kcr, Kcr, Telangan

బీజేపీ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో అధికారంలోకి రావాలంటే చాలా కష్టతరమైన విషయం.కాంగ్రెస్ కూడా ప్రజల్లో ఉన్నా వారి నిరసనలు ఓట్ల రూపంలోకి మారుతాయన్నది మాత్రం అబద్దం.ఎందుకంటే టీఆర్ఎస్ చివరి ఎన్నికల సమయంలో ప్రజల మెప్పు పొందాలంటే ఎటువంటి స్ట్రాటజీని ఎంచుకోవాలన్నది కేసీఆర్ కు పక్కా క్లారిటీ ఉంటుంది.కావున బీజేపీ తో పొత్తు పెట్టుకునే పరిస్థితి వచ్చే అవకాశం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube