ఈఎమ్ఐల విష‌యంలో కొత్త రూల్స్ తీసుకొచ్చిన ఆర్బీఐ..

ఇప్పుడున్న స‌మాజంలో ఈఎమ్ ఐ అంటే తెలియ‌ని మ‌ధ్య త‌ర‌గ‌తి వారుండ‌రేమో.చిన్న చిన్న జాబులు చేసుకునే వారు ఎక్కువ‌గా ప‌ర్స‌న‌ల్ లోన్లు లేదంటే వ‌స్తువులు, లేదంటే బైకులు, కార్ల మీద లోన్లు తీస‌కుంటూ ఉంటారు.

 Rbi Brings New Rules On Emis, Emis, Rbi Rules, From Oct 1 , New Rules , Aproval-TeluguStop.com

వాటిని నెల నెల ఈఎమ్ ఐ రూపంలో క‌డుతుంటారు.అయితే ఈ ఈఎమ్ ఐల‌పై కొత్త రూల్స్‌ను తీసుకొస్తోంది ఆర్బీఐ.

ఇందుకోసం స‌రికొత్త గైడ్‌లైన్స్‌ను కూడా జారీ చేసింది.ఈ కొత్త రూల్స్‌ను అక్టోబర్‌ 1 నుంచి అమ‌లు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

అయితే ఆటోమేటెడ్‌ డెబిట్స్ వాటిల్లో ఈ రూల్స్‌ అమలు కానున్నాయి.

కొత్త గైడ్‌లైన్స్ ప్ర‌కారం ఈ ప్రాసెస్‌ను బ్యాంకులు మాత్రమే ఆటోమేటెడ్ డెబిల్స్ ఈఎమ్ ఐల విష‌యంలో చేప‌డుతాయి.

అలాగే ఈఎమ్ ఐ పేమెంట్ జ‌రిగే ముందు రోజే యూజర్ల‌ను అల‌ర్ట్ చేయాల్సి ఉంటుంది.బ్యాంకులు మెసేజ్ రూపంలో లేదంటే మెయిల్ ద్వారా యూజ‌ర్ల‌ను అల‌ర్ట్ చేస్తాయి.ఎవ‌రికైతే రూ.5 వేల కంటే ఎక్కువ పేమెంట్లు చెల్లిస్తున్నారో వారి నుంచి మాత్ర‌మే ఓటీపీ తప్పనిసరి చేసింది.ఇక ఈఎమ్ ఐ ల విష‌యంలో అప్రూవల్ ప్రాసెస్ లో భాగంగా క‌స్ట‌మ‌ర్ మొబైల్‌ నెంబర్ క‌రెక్టుగా ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది.త‌ప్పుడు నెంబ‌ర్లు ఇవ్వ‌కూడ‌దు.

Telugu Thousand, Aproval Process, Customers, Oct, Mutuval Funds, Rbi-Latest News

ఇక కొత్త రూల్స్ వ‌ల్ల మ్యూచువల్‌ ఫండ్‌ సిప్స్ పై ఎలాంటి ప్రభావం ఉండదట‌.ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న‌టువంటి అన్ని క్రెడిట్​, డెబిట్​ కార్డుల ట్రాన్ స‌క్ష‌న్ల‌కు ఇవి అమ‌లు అవుతాయి.మ‌రీ ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తో పాటు ఆన్‌లైన్ పేమెంట్స్‌, యుటిలిటీ బిల్స్ లాంటి వాటికి ఈ గైడ్ లైన్స్ వ‌ర్తిస్తాయి.ఇక హోమ్ లోన్లు, ఈఎంఐ ల విష‌యంలో ఎవ‌రైతే రూ.5వేల‌కు మించి ఆటోడెబిట్ లో ఉంటున్నారో వారు క‌చ్చితంగా మ్యానువల్‌గా అప్రూవ్‌ చేయాల‌ని ఆర్బీఐ ఆదేశించింది.ఇక ఈ కొత్త రూల్స్ లో భాగంగా మ‌రిన్ని చార్జీలు పెంచే అవాక‌శం ఉంద‌ని ప్ర‌చారం న‌డుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube