అల్లు అర్జున్‌లో ఇన్నీ లోపాలు ఉన్నాయా.. వాటన్నింటిని అధిగమించి ఈ స్థాయికి?

టాలీవుడ్ లో ఆయనో సంచలనం.తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ, ప్రస్తుతం ఐకాన్ స్టార్ట్ గా పిలవబడుతున్న నటుడు అల్లు అర్జున్.

 Unknown Facts About Stylish Star Allu Arjun, Allu Arjun, Tollywood, Allu Aravind-TeluguStop.com

చిన్నప్పుడు చదువులో అంతంత మాత్రంగానే ఉన్నా.డాన్స్ లో మాత్రం మంచి టాలెంట్ ఉందనే చెప్పాలి.

తన తండ్రి అల్లు అరవింద్ నిర్మాత అయినప్పటికీ అల్లు అర్జున్ ని ఏ రోజూ సినిమాల్లోకి రమ్మని అడగలేదు.తనకిష్టం వచ్చిన ఫీల్డ్ లో వెళ్ళాలి అనుకునే వారు.

అల్లు అర్జున్ కి యానిమేషన్ పై ఇంట్రెస్ట్ ఉండేది.ఈలోగా ఏదైనా సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని అల్లు అర్జున్ అనేసరికి.

సినిమా అంటే మామూలు విషయం కాదు అని ఆయన్ని తన తండ్రి అల్లు అరవింద్ నటనలో శిక్షణ కోసం ముంబై పంపించారు.

ఇలా సాగుతూ ఉండగా.

అశ్వనీ దత్ ఒక సినిమా తీయాలని చూస్తున్నారు.అది రాఘవేందర్ రావుకు 100 వ చిత్రం.అప్పుడు మెగాస్టార్ చిరంజీవి కల్పించుకుని.ఈ సినిమాలో అల్లు అర్జున్ నీ హీరోగా పరిచయం చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.అలా వచ్చిన చిత్రమే గంగోత్రి.అది భారీ విజయాన్ని అందుకావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

మొదటి సినిమా హిట్ అవడంతో తనకింక యాక్టింగ్ మొత్తం వచ్చేసింది అనుకున్నారు అల్లు అర్జున్.ఆ తర్వాత తీసిన ఆర్య సినిమాతో అతనికి ఎంత వరకు వచ్చో తెలుసుకున్నాడు.

ఒక్కో సీన్ చేయడానికి చాలా షాట్స్ తీసుకునేవాడు.అదేవిధంగా ఒత్తులు స్పష్టంగా పలికే వారు కాదు.

తనది రిచ్ వాయిస్ కాదని, తన లుక్ చేంజ్ చేసుకోవాలంటూ పలువురు చెప్పడంతో అప్పుడే అనుకున్నాడు అల్లు అర్జున్.తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని.

ఇక అక్కడినుంచి తన సినీ ప్రయాణంలోఎంత కష్టపడడానికైనా సిద్దంగా ఉంటానని నిశ్చయించుకున్నాడు.

Telugu Allu Aravind, Allu Arjun, Chiranjeevi, Tollywood-Movie

అలా ప్రతీ సినిమాలోనూ తన డ్రెస్సింగ్ స్టైలే, హెయిర్ స్టైల్, ఇలా ప్రతీ దాంట్లోనూ కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు అల్లు అర్జున్.అలా కథను ఎంచుకోవడంలో జాగ్రత్తలు పాటిస్తూ సరి కొత్త పాత్రలతో అభిమానులను అలరిస్తున్నారు.ఒక్కోసారి కొన్ని సినిమాలు తీయడానికి టైం పడుతుంది.

ఎందుకంటే ఆ పాత్రకి తగ్గట్టుగా తాను మారితెనే ఆ క్యారెక్టర్ సరిగ్గా పండుతుందని ఆయన అనేవారు.అలాంటి కోవకి చెందిన సినిమాల్లో ఒకటి బద్రీనాధ్.

ఆ సినిమాలో పాత్రకు కావాల్సిన యుద్ధ మెళకువలను వియత్నాం వెళ్లి దాని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకొని మరీ వచ్చారు.ఇలా తాను ఏ పాత్ర ధరించినా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా ఉండాలని ఆయన ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటారు అల్లు అర్జున్.

ఇలా ఆయన ఏ పాత్ర పోషించినా దాంట్లో కొత్తదనం ఉండేటట్టు చూసుకుంటడు అల్లు అర్జున్.అలా చేసిన వాటిలో ముఖ్యంగా వేదం సినిమాలోని పాత్ర చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది.

ఇంక రుద్రమదేవిలో చేసిన గోన గన్నారెడ్డి పాత్ర.ఈ సినిమాలో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా చేసి మరో మెట్టు ఎదిగారు అల్లు అర్జున్.

చిరంజీవి అంటే బ్లడ్ బ్యాంక్, అమల ఆంటీ బ్లూ క్రాస్ అలా అల్లు అర్జున్ అంటే ఏదో ఒకటి గుర్తుకు వచ్చేలా జీవితంలో ఏదైనా చేయాలని ఆయన ప్రతీ క్షణం ఆలోచిస్తుంటారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube