పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను పర్గత్ సింగ్‌కు ఇవ్వండి: అమెరికాలోని ప్రవాసీ సంఘం డిమాండ్

పంజాబ్‌ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న సంక్షోభం కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో తిరుగులేని నేతగా వున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ అనూహ్య పరిణామాల మధ్య సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.తనను మూడుసార్లు ఈ విధంగా అవమానించారని.

 North American Punjabi Association Seeks Nri Affairs Portfolio For Pargat Singh,-TeluguStop.com

వీటితో తాను విసిగిపోయానని కెప్టెన్ ఆవేదన వ్యక్తం చేశారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ సీఎం మార్పుకే మొగ్గు చూపారు.

ఇందుకు సిద్ధూ కూడా ఒక కారణమన్న సంగతి తెలిసిందే.

పీసీసీ చీఫ్‌గా పగ్గాలు అందుకున్న వెంటనే.

తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టడంతో పాటు అమరీందర్ పాలనపై వారితో అధిష్టానానికి లేఖలు రాయించారు.ఈ క్రమంలో ఉత్తరాఖండ్, గుజరాత్, కర్ణాటకలలో బీజేపీ అమలు చేసిన సీఎం మార్పు వ్యూహాన్నే కాంగ్రెస్ పంజాబ్‌లో ఫాలో అయ్యింది.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున వున్న దళిత ఓటర్లను ఆకట్టుకునేందుకు గాను ఆ వర్గానికి చెందని చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎంగా ఎంపిక చేసింది.తద్వారా అకాలీదళ్, బీఎస్పీ, బీజేపీ, ఆప్‌ల వైపు దళితులు మళ్లకుండా చేయాలన్నది కాంగ్రెస్ ప్లాన్.

Telugu Americanpunjabi, Nriaffairs, Pargat Singh, Punjabis, Nri-Telugu NRI

ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆప్, శిరోమ‌ణి అకాళిద‌ళ్‌, బీఎస్పీలు పంజాబ్‌పై దృష్టి పెట్టాయి.శిరోమ‌ణి అకాళిద‌ళ్‌, బ‌హుజ‌న స‌మాజ్‌వాదీ పార్టీలు ఇప్ప‌టికే క‌లిసి పోటీ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాయి.అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే.ద‌ళితుల‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి.వీటికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.పంజాబ్‌లో ద‌ళితులు 32 శాతం ఉంటే, సిక్కులు 25 శాతం మంది ఉన్నారు.

ఇక రాష్ట్ర అసెంబ్లీలోని అన్ని పార్టీల నుంచి మొత్తంగా 30 మంది ద‌ళితులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.అటు కేంద్రంలో ముగ్గురు మంత్రులుగా ప‌నిచేస్తున్నారు.

ఇంతటి ప్రభావం చూపగల దళితుల ఓటు బ్యాంక్‌ను గుప్పెట బంధించేందుకే కాంగ్రెస్ పార్టీ చ‌ర‌ణ్‌జిత్ సింగ్ స‌న్నీకి అవ‌కాశం ఇచ్చింది.

మరోవైపు కేబినెట్ కూర్పుపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూలు హైకమాండ్‌తో మంతనాలు జరుపుతున్నారు.

తన వర్గం వారికి ఎక్కువ పదవులు ఇప్పించుకునేలా సిద్ధూ, మాజీ సీఎం అమరీందర్ సింగ్ లాబీయింగ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఎన్ఆర్ఐ సంఘం నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చింది.

జలంధర్ కంటోన్మెంట్ నుంచి గెలుపొందిన హాకీ క్రీడాకారుడు పర్గత్ సింగ్‌‌కు కేబినెట్‌లో ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను కేటాయించాల్సిందిగా డిమాండ్ చేస్తోంది.

Telugu Americanpunjabi, Nriaffairs, Pargat Singh, Punjabis, Nri-Telugu NRI

ఈ మేరకు పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి వేర్వేరుగా రాసిన లేఖల్లో ఎన్ఏపీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ కోరారు.పంజాబీ ప్రవాసులలో ఎక్కువ మంది దోబా ప్రాంతానికి చెందిన వారేనని.అందువల్ల ఎన్ఆర్ఐ వ్యవహారాలను చూసే మంత్రి అదే ప్రాంతానికి చెందినవారై వుండాలని సత్నామ్ సింగ్ సూచించారు.

అందువల్ల ఈ పోర్ట్‌ఫోలియోకు పర్గత్ సింగ్ సరైన వ్యక్తని ఆయన చెప్పారు.ప్రస్తుతం వివిధ దేశాల్లో స్థిరపడ్డ పంజాబీ ప్రవాసులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని.వీటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం వుందని సత్నామ్ సింగ్ అన్నారు.అలాగే పంజాబీ ప్రవాసులకు సంబంధించిన వివాదాలపు పరిష్కరించేందుకు గాను దోబా ప్రాంతంలో మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వుండాలని ఆయన డిమాండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube