కేటీఆర్‌ను ఫిదా చేసిన బుడ్డోడు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

మ‌న ద‌గ్గ‌ర చేయాల‌నే ప‌ట్టుద‌ల ఉండాల‌నే గానీ ఏ పని అయినా చేయొచ్చ‌ని ఇప్ప‌టికే ఎంద‌రో నిర‌పించారు.చాలా చిన్న పొజీష‌న్ నుంచి వ‌చ్చి దేశానికి రోల్ మాడ‌ల్ గా త‌యార‌య్యారు ఎంతో మంది.

 Minister Ktr Inspired By The Ninth Class Boy Who Supply News Papers To Homes, Kt-TeluguStop.com

అబ్దుల్ క‌లాం లాంటి వారు కూడా పేప‌ర్ బాయ్ గా ప‌నిచేసిన వారే.అందుకే అన్నారు పెద్ద‌లు కృషి ఉంటే రుషులవుతార‌ని, అయితే ఈ పాట ఇప్పుడెందుకు అంటే వీట‌న్నింటికీ ఇప్పుడు ఓ బుడ్డోడు స‌రిపోతాడ‌ని పిస్తుంది.

ఈ ఒక్క‌రోజే ఆ బుడ్డోడు సోష‌ల్ మీడియాలో స్టార్ అయిపోయాడు.ఏకంగా మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయిపోయారు.

ఆ వీడియో చూసిన మంత్రి కేటీఆర్ ఆ చిన్నోడి ఆత్మవిశ్వాసానికి ఫిదా అయిపోయిన‌ట్టు తెలిపారు.ఇలాంటి ఎన్నో ఇన్ స్పిరేష‌న్ వీడియోల‌ను మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదిక‌గా ఎన్నో షేర్ చేస్తూ ఉంటారు.

జ‌గిత్యాలకు జిల్లాలో ఈ వీడియో తీసిన‌ట్టు తెలుస్తోంది.ఈ ప‌ట్ట‌ణంలో 9వ తరగతి చ‌దువుతున్న ప్రకాష్ మార్నింగ్ టైమ్‌లో పేపర్ వేస్తూ డ‌బ్బులు సంపాదిస్తున్నాడు.అయితే ఆ కుర్రాడిని ఓ వ్య‌క్తి వెంబ‌డిస్తూ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆగుతాడు.ఏం పేరు అని అడ‌గ్గా త‌న వివ‌రాలు చెప్తుంటాడు.

దాంతో ఆ కుర్రాడు త‌న గురించి ఎప్తాడు.

చ‌దువుకునే వ‌య‌సులో ఇలా ఎందుకు చేస్తున్నావ‌ని అడ‌గ్గా ఏం చేయొద్దా త‌ప్పేముంది అని ఎదురు ప్ర‌శ్నిస్తాడు.ఈ వీడియో ఈరోజు ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో చెక్క‌ర్లు కొడుతోంది.కాగా దీన్ని చూసిన కేటీఆర్ చిన్నారి ఆత్మవిశ్వాసం త‌న‌ను బాగా ఆకట్టుకున్న‌ట్టు చెప్తూ కేటీఆర్ ఆ వీడియోను షేర్ చేశారు.

కాగా ఈ వీడియో చూసిన వారంతా కూడా ఆ బుడ్డోడి మాట‌ల‌కు ఫిదా అయిపోతున్నారు.క‌ష్ట‌ప‌డే త‌త్వం ఉండాలే గానీ మంచి పొజీష‌న్‌లో ఉంటాడ‌ని అంతా కామెంట్లు పెడుతున్నారు.

ఇంకొంద‌రు ఆ చిన్నారికి చేయూత ఇవ్వాల‌ని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube