ఆ రాష్ట్రంలో వేలాది ఖడ్గమృగాల కొమ్ములు దహనం... ఎందుకు చేస్తున్నారంటే..?

తప్పుడు ప్రచారాల వల్ల చాలా జంతువులు అన్యాయంగా బలవుతున్నాయి.ఫలానా జంతువును చంపి తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఇప్పటికే ఎన్నో అపోహలు ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించాయి.

 Thousands Of Rhinoceros Horns Are Burning In That State  Why Are They Doing It-TeluguStop.com

ముఖ్యంగా చైనీయులు.జంతువుల్లో పోషకాల నిధి నిక్షిప్తమై ఉంటుందని భావిస్తుంటారు.

అందుకే వారు ఈ భూమి గ్రహంలో తిరిగేవి, ఎగిరేవి, పాకేవి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జంతువులను వధిస్తుంటారు.వీరి పిచ్చి నమ్మకాల వల్ల ఖడ్గమృగాల ప్రాణాలకు సైతం తీవ్ర ముప్పు వాటిల్లుతోంది.

ఖడ్గమృగాలకు ఒక బలమైన పదునైన కొమ్ము ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.ఈ శాకాహార జంతువులలో తమ కొమ్ములను ఉపయోగించి సింహం పులి వంటి మాంసాహార జంతువులకు హడల్ పుట్టిస్తుంటాయి.

అడవిలో వీటిని మరేతర జంతువులు చంప లేవు.కానీ వేటగాళ్లు వల్ల ఇవి భారీ సంఖ్యలో ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది.

చంపేసి కొమ్ములను కోసేసి అమ్ముకుంటున్నారు.

కొందరు మత్తు మందు ఇచ్చి ఖడ్గమృగాల కొమ్ములను రాంపాలతో కోసి తీసుకెళ్తున్నారు.ఈ కొమ్ములను చైనీయులు తయారు చేసే సంప్రదాయ మెడిసిన్‌లో వాడుతారని సమాచారం.

క్యాన్సర్ నుంచి హ్యాంగోవర్ వరకు అలాగే కామోద్దీపన మందుల తయారీలో ఖడ్గమృగాల కొమ్ములను వాడతారు.కానీ వీటిలో ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ లేవని శాస్త్రవేత్తలు గుర్తించారు.

అలాగే క్రూరమైన వేటగాళ్ల బారినుంచి ఖడ్గమృగాల ని సంరక్షించేందుకు సెప్టెంబర్ 22న ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని (World Rhino Day) నిర్వహిస్తున్నారు.

Telugu Latest, Rihno Day-Latest News - Telugu

కాగా నిన్న అనగా సెప్టెంబర్ 22న అస్సాం ప్రభుత్వం ఖడ్గమృగాల దినోత్సవ వేడుకను అద్భుతంగా జరిపింది.వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న 2,500 ఖడ్గమృగాల కొమ్ములు దహనం చేసింది.అలాగే ఈ దహన కార్యక్రమాలను ఒక వేడుకగా జరిపింది.

ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రారంభించిన ‘రైనో హార్న్ రీ-వెరిఫికేషన్’ కార్యక్రమంలో భాగంగా అధికారులను ఈ కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు.ఖడ్గమృగం కొమ్ములకు వైద్య విలువలు ఉంటాయనేది ఒక అపోహ మాత్రమే అని చెప్పేందుకే ఈ కార్యక్రమం నిర్వహించారు అస్సాం అధికారులు.

ఈ జీవుల కొమ్ములకు ఎలాంటి విలువ లేదని వేటగాళ్లు, స్మగ్లర్లకు తెలియజేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అస్సాం చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఎంకే యాదవ్ వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube