రెండు పెద్ద పులులు ఎదురు పడితే ఇంత భయంకరంగా ఉంటుందా..

అడవి అంటేనే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది సింహం లేదంటే పులి లాంటివి మాత్రమే.ఎందుకంటే మిగతా జంతువులు ఎన్ని ఉన్నా గానీ వీటికి ఉండే క్రేజ్ అలాంటిది మరి.

 Dangerous Fight Between Two Tigers In Forest, Two Tigers Fight, Tigers Fight Vir-TeluguStop.com

ఈ జంతువులు మాటు వేస్తే మాత్రం ఎంతటి జంతువు అయినా గానీ వాటికి ఆహారం కావాల్సిందే.ఇక పులి పంజా నుంచి తప్పించుకోవడం అంటే చచ్చి బ్రతకడమే అని చెప్పాలి.

మరి వేరే జంతువులు కనిపిస్తే మట్టుబెట్టే ఈ పెద్దపులులు వాటి జాతికి చెందిన వాటిని చూస్తేనే భగ్గుమంటాయి.ఎందుకంటే పెద్ద పులులు తమ జాతులకు చెందిన వాటిని చూస్తే ఆధిపత్యమే గుర్తుకు వస్తుందంట వాటికి.

ఎవ్వరికి సాధ్యం కాదు.అలాంటిది రెండు పులులు ఒకదానికొకటి ఓడించేందుకు భీకరంగా పోరాడుతాయి.

మరి రెండు పొట్టేళ్లు పోటీ పడితేనే చూడాలనిపిస్తే ఇక రెండు పులులు పోటీ పడితే ఎలా ఉంటుందో ఊహించండి.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

దీన్ని చూసిన వారంతా కూడా పులి అంటే ఇలాగే ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇందులో అర్థం అవుతున్న విషయం ఏంటంటే ఒక పులి తన ప్రాంతానికి వేరే పులి వస్తే మాత్రం తన్ని తరిమేసే దాకా ఊరుకోదన్నమాట.

ఇందుకోసం ప్రాణాలు అడ్డుపెట్టైనా పోరాడుతుంది.

తన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఒకానొక సందర్భంలో ప్రాణాలు విడిచేందుకు కూడా పులులు వెనకడుగు వేయవు.

తన ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించేందుకు అంతటి పట్టింపు, తెగువను చూపిస్తుంటాయి పులులు.తాజాగా రెండు పులుల పోరాటం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.ఈ వీడియోలో ఓ పులి ఇంకో పులి ఏరియాలోకి రావడంతో రెండూ పంజా విసురుకుంటాయి.అత్యంత భీకరంగా గర్జనలతో అడవి దద్దరిల్లిపోయేలా పోరాటం చేయడం మనం చూడొచ్చు.12 సెకన్లు ఉన్న ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube