ప్రభుదేవాకు నాతో మాట్లాడే దమ్ముందా.. దర్శకుడు గీతాకృష్ణ కామెంట్స్ వైరల్!

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విభిన్న కథలతో ప్రేక్షకుల ముందు వచ్చిన దర్శకుడు గీతా కృష్ణ.తెలుగులో అక్కినేని నాగార్జున, రమ్యక్రిష్ణ నటించిన సంకీర్తన అనే సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన మొదటి సినిమాతోనే నంది అవార్డును సొంతం చేసుకున్నారు.

 Director Geetakrishna Shocking Comments On Actor Prabhudeva Details, Prabhudeva-TeluguStop.com

అప్పట్లో ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు గీతా కృష్ణ.ఆ తర్వాత వచ్చిన కోకిల, కీచురాళ్లు, ప్రియతమా లాంటి చిత్రాలు సైతం వినూత్న కథతో అభిమానులను అలరించాయి.

తెలుగులోనే కాదు, తమిళంలోనూ తన టాలెంట్‌ను నిరూపించుకొని ప్రముఖుల చేత శభాష్ అనిపించుకున్నరు గీతా కృష్ణ.

అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించడం, అడ్వాన్స్‌డ్‌గా సినిమాలు తీయడం వల్లనే అన్ని తరాల ప్రేక్షకులకు తన చిత్రాలు చేరడంలేదని దర్శకుడు, నిర్మాత గీతా కృష్ణ అన్నారు.

కొరియన్ సినిమాలపై మక్కువతో ఇన్స్‌పైర్ అయ్యి.అలాంటి తీస్తానన్న గీతా కృష్ణ.కాపీ మాత్రం చేయలేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.“ఐ యామ్ ఫిల్మ్ ఎన్‌సైక్లోపీడియా… నో బడీ కెన్ బీట్ మీ ఇన్ ఫిల్మ్ నాలెడ్జ్” అన్న గీతా కృష్ణ.సినిమాకు సంబంధించి ఎలాంటి డిబేట్‌లోనైనా తాను పాల్గొనేందుకు సిద్ధమని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.1982 నుంచి తాను సినిమా ఫెస్టివల్‌కు వెళ్లేవాడినని గీతా కృష్ణ అన్నారు.మన ఇండస్ట్రీకి సంబంధించి ఎవరూ రాకపోయేవారని.అలా వెళ్లాలని తానే అందరికీ పరిచయం చేశానని గర్వంగా చెప్పుకున్నారు.

Telugu Prabhudeva, Geetha Krishna, Geetakrishna, Kollywood, Tollywood, Tottigang

సినిమా ఫెస్టివల్‌కు వెళ్లినా సినిమాకు సంబంధించిన విషయాలేవీ తనకు తెలియదని అన్నారు.విశ్వనాథ్ గారి దగ్గర చేరాకే సినిమాను ఎలా తీయాలి.ఏంటీ అనే వి।షయాలు తెలుసుకున్నానని గీతా కృష్ణ అన్నారు.ఈ సందర్భంలో నటుడు ప్రభు దేవాకు ఆయనకు మధ్య విభేదాలున్నాయా అన్న ప్రశ్నకు గీతా కృష్ణ తీవ్రంగా స్పందించారు.‘ అసలు ప్రభు దేవాకు నాతో మాట్లాడే దమ్ముందా ? ఇప్పటికీ కూడా ఎయిర్ పోర్టులో కనిపించినపుడు హలో సర్ అంటాడని గీతా కృష్ణ స్పష్టం చేశారు.ఈవీవీ సైతం నా టైటిల్‌ను కాపీ కొట్టారని గీతా కృష్ణ అన్నారు.

తొట్టి గ్యాంగ్‌ అనే టైటిల్ నాదేనని… జంధ్యాలకు కూడా తన టాలెంట్‌ గురించి తెలుసని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube