రేవంత్ దెబ్బకు కేసీఆర్ వణుకుతున్నారా ? 

ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనే రేవంత్ దూకుడుగా వ్యవహరించే వారు.

 Kcr Troubled On Revanth Reddy Issue Revanth Reddy, Trs, Telangana, Kcr, Ktr, Tpc-TeluguStop.com

కేసీఆర్, కేటీఆర్ వ్యవహారాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి వారి హవాను తగ్గించేందుకు ప్రయత్నించేవారు.ఇక పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మరింత స్పీడ్ పెంచారు.

పార్టీలోని సీనియర్ నాయకులు తనకు సహకరించినా, లేకపోయినా తన బలం ఏంటో నిరూపించుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం తోపాటు , కెసిఆర్ కేటీఆర్ వ్యవహారాల పైన చర్చ జరిగే విధంగా రేవంత్ ముందుకు వెళ్తున్నారు.

        తెలంగాణలో బిజెపి గ్రాఫ్ పెరిగినట్టే కనిపించినా,  రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బీజేపీ ప్రభావం కంటే కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.గతంలో బండి సంజయ్ దూకుడుగా వ్యవహరించినా, ఆ తర్వాత కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కిన దగ్గర నుంచి  ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయనే ప్రచారం నడుస్తోంది.

కారణాలు ఏవైనా సంజయ్ గతంకంటే స్పీడ్ తగ్గించడంతో ఇప్పుడు రేవంత్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
 

Telugu Bandi Sanjay, Etela Rajender, Hujurabad, Kishan Reddy, Pcc, Revanth Reddy

    ప్రస్తుతానికి కేసీఆర్ కేటీఆర్ కు రేవంత్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.దీంతో బీజేపీ అంశాన్ని పక్కనపెట్టి రేవంత్ ను ఎదుర్కోవడం పై కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.నిర్మల్ లో బిజెపి ఇటీవల భారీ బహిరంగ సభను నిర్వహించింది.

ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ సైతం హాజరయ్యారు.దీని కంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిర్వహించిన గజ్వేల్ సభ భారీగా సక్సెస్ అవడం లక్షలాది మంది జనాలు ఈ మీటింగ్ కు హాజరు అవడం, ఇవన్ని రేవంత్ ఇమేజ్ ను అమాంతం పెంచేశాయి.

  ఇప్పుడు టిఆర్ఎస్ కు ముచ్చె చెమటలు పట్టించే విధంగా రేవంత్ తన రాజకీయాన్ని నడిపిస్తూ ఉండడంతో పూర్తిగా రేవంత్ ను అడ్డుకునే విషయంపైనే కేసీఆర్ దృష్టి సారించారు.   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube