వ్యాక్సిన్ సర్టిఫికెట్ మీద ప్రధాని ఫొటో.. సెటైర్ వేసిన సీనియర్ ఎడిటర్

ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేస్తుందో అందరికీ తెలిసిందే.అయితే ఈ కరోనాను ఎదుర్కోవాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం వ్యాక్సిన్.

 Prime Minister's Photo On The Vaccine Certificate  Senior Editor By Setair, Vacc-TeluguStop.com

కాగా ఇక దేశ వ్యాప్తంగా టీకాలు వేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వం కూడా బాగానే కసరత్తులు చేస్తోంది.దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇందుకోసం తీసుకు వచ్చిన వ్యాకసిన్ల క్రెడిట్ మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖాతాలో పడే విధంగా బీజేపీ బాగానే ప్లాన్ వేసింది.

ఇందుకోసం రీసెంట్ గా ప్రధాని మోడీ పుట్టిన రోజునాడు ప్రత్యేకంగా టీకా ఉత్సవ్ చేయడం ఇందులోకి వస్తుందని చెప్తున్నారు చాలామంది.కాగా ఆరోజు అయితే ఏకంగా రెండున్నర కోట్ల డోసుల వ్యాక్సిన్ వేయడం కూడా పెద్ద సంచలనమే అని చెప్పాలేమో.

అయితే మోడీ పుట్టిన రోజు తర్వాత మాత్రం మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది.ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారికి మన దేశంలో సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు.

వారు విదేశాలకు వెళ్లాలన్నా లేదంటే ఇంకేదైనా పని చేయాలనుకున్నా కూడా చాలా చోట్ల ఈ సర్టిఫికెట్ చాలా కీలకం అవుతోంది.ఇక మన దేశం నుంచి విదేశాలకు వెళ్లిన వారిలో ఎవరైనా రెస్టారెంట్లలో తినడానికి వెళ్లినప్పుడు చాలా వరకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు.

ఇలాగే సీనియర్ ఎడిటర్ అయిన సిద్ధార్థ్ వరదరాజన్ ను కూడా పారిస్ లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ అడిగారంట.

Telugu Certificate, Covid, Covid Vacine, Narendramodi, Senior, Sidhardh-Latest N

అయితే ఆయన తన దగ్గర ఉన్న సర్టిఫికెట్ చూపించారంట.అయితే ఆ సర్టిఫికెట్ లో ఉన్న మోడీ ఫొటోను చూసిన ఆ వెయిటర్ అది మీది కాదు కదా వేరే వ్యక్తి ఫొటో అని వాదించాడంట.కాగా దానికి సిద్ధార్థ్ రిప్లై ఇస్తూ ఆ ఫొటోలో ఉన్నది మా దేశ ప్రధాని అని చెప్పగా.

అదేంటి మీ సర్టిఫికెట్ మీద ఆయన ఫొటో ఎందుకు అంటూ రివర్స్ ప్రశ్న వేసే సరికి ఆయనకు ఏం చెప్పాలో అర్థం కాలేదంట.ఇక తనకు ఎదురైన ఈ అనుభవాన్ని కాస్తా ఆయన ట్విట్టర్ వేదికగా కొన్ని సెటైర్లు పేల్చారు.

దాన్ని చూస్తుంటే అసలు ఎవరి సర్టిఫికెట్ మీద వారి ఫొటోలు ఉండాలి గానీ మోడీ ఫొటో ఎందుకు అన్నట్టు ఆయన సెటైర్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube