లవ్ స్టోరి’లో ఊహించని ట్విస్టు.. వరుసకు అన్నా చెళ్లెల్లు అవుతారనడంతో చివరకు..

కొన్ని సినిమాలు చూస్తుంటే నిజజీవితంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తుండటం సహజమే.కానీ, చిత్రంలో జరిగిన సంఘటన రియల్ లైఫ్‌లో జరిగితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ.

 Unexpected Twist In 'love Story' Finally, Anna Is Not Going To Be Younger Sister-TeluguStop.com

అలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది.వివరాల్లోకెళితే క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం సఖి సినిమాలో హీరో హీరోయిన్స్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ఎవరి ఇళ్లలో వారే ఉండిపోతారు.

అనుకోకుండా హీరోయిన్ మెడలో మంగళ సూత్రం కనబడటంతో ఆమెను ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టడంతో హీరో హీరోయిన్స్ వేరు కాపురం పెట్టుకుంటారు.కాగా, సేమ్ సీన్రి యల్ లైఫ్‌లో రిపీట్ అయింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అమ్మాయి, అబ్బాయి ఏడాది కాలం నుంచి లవ్ చేసుకున్నారు.

యువకుడికి 24 ఏళ్లు కాగా యువతికి 21 ఏళ్లు.

యువకుడికి తన సోదరి ద్వారా అమ్మాయి పరిచయం కాగా, అది కాస్తా ప్రేమగా మారింది.ఇకపోతే వీరు తమ లవ్ స్టోరి వివాహ బంధంగా మారాలనుకున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్‌లో సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారు.అనంతరం ఎవరి ఇళ్లలో వారే ఉండిపోయారు.

కాగా, ఎవరు లీక్ చేశారో తెలియదు కానీ వారికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. సోషల్ మీడియాలో కనిపించిన ఆ ఫొటోలను చూసి బంధువులు షాక్ అయ్యారు.

వీరిరువురు వరుసకు అన్నా చెల్లెల్లు అవుతారని తేల్చారు.

Telugu Marrege, Attempt, Khammama, Kothha Gudem, Love Story, Sister Brother, Soc

దాంతో సదరు యువతి తీవ్రమనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.ఈ విషయం తెలుసుకున్న యువకుడు పురుగుల మందు తాగి వ్యవసాయ బావిలో దూకాడు.వెంటనే యువకుడి కుటుంబీకులు బావి నుంచి అతడిని బయటకు తీసి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.కాగా, ఇలా ప్రేమకథ కాస్తా ట్రాజెడీగా మారడం పట్ల స్థానికంగా ఉండే వారంతా కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube