సీనియర్ ఎన్టీఆర్ కథ రాయమన్నారు.. చంద్రబాబు వద్దన్నారు.. పరుచూరి బ్రదర్ షాకింగ్ నిజాలు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ సినీ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి తారకరామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే.

 Senior Ntr Wrote The Story Chandrababu Said No Paruchuri Brother Shocking Facts,-TeluguStop.com

అయితే ఎన్టీఆర్, మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మేజర్ చంద్రకాంత్ బాక్సాఫీస్ వద్ద ఏ విధమైనటువంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఇందులో ఉన్నటువంటి పుణ్యభూమి నా దేశం అనే పాట ఇప్పటికీ జాతీయ పండుగలప్పుడు మార్మోగిపోతోంది.

అయితే ఈ సినిమా కథ రాయడం కొన్ని ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయని ఈ సినిమా రచయితలు పరుచూరి బ్రదర్స్ తెలియజేశారు.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్ ఛానల్ లో ఆ విషయాన్ని పంచుకున్నారు ఓ సందర్భంలో ఎన్టీఆర్ ను కలిసినప్పుడు బ్రదర్ కథ రాయండి సినిమా చేద్దామని చెప్పారు.

అయితే అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున చంద్రబాబునాయుడు గారు కథ రాయవద్దని చెప్పారు.అన్నగారి ఆరోగ్యం ముఖ్యమని భావించడంతో కథ రాయడం లేదు.ఈ క్రమంలోని దగ్గర వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్టీఆర్ ని చూసి భయమేసింది.కనపడితే ఎక్కడ కథ అడుగుతాడోనని తప్పించుకుని తిరుగుతున్న సమయంలో భుజంపై చేయి వేసి ఏంటి బ్రదర్ కథ సిద్ధమైందాఅని అడగగా వెంటనే సిద్ధమైందని చెప్పాను అయితే తీసుకురండి మాట్లాడుకుందాం అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను.

Telugu Biopic, Chandrababu, Chandrakant, Mohan Babu, Snenior Ntr, Tollywood-Movi

ఈ క్రమంలోని ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అన్నగారితో చెప్పి రాత్రంతా మేలుకొని మేజర్ చంద్రకాంత్ సినిమా కథను సిద్ధం చేశామని పరుచూరి గోపాలకృష్ణ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.ఈ క్రమంలోనే మరుసటిరోజు కథను తీసుకొని అన్న గారి దగ్గరికి వెళితే కథ వింటున్న ఎన్టీఆర్ ఏడవ నిమిషానికే షూటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పారు.ఇలా మేజర్ చంద్రకాంత్ సినిమా తెరకెక్కిందనీ ఈ చిత్రం వెనుక ఉన్న రహస్యాన్ని పరుచూరి గోపాలకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలైన తర్వాత బాక్సాఫీసు వద్ద అఖండ విజయాన్ని అందుకుని ఎన్టీఆర్, మోహన్ బాబు సినీ కెరీర్లో ఒక సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.

Telugu Biopic, Chandrababu, Chandrakant, Mohan Babu, Snenior Ntr, Tollywood-Movi

ఒకవేళ ఎన్టీఆర్ కథ రాయమని చెప్పి నేను రాయకుండా ఉండి ఆ శుభకార్యానికి వెళ్లకపోయి ఉంటే ఎంతో అద్భుతమైన గొప్ప చిత్రాన్ని తెలుగు పరిశ్రమ కోల్పోయేదనిపిస్తుందని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గోపాలకృష్ణ మేజర్ చంద్రకాంత్ సినిమా విషయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.సినిమా అంతా ఎంతో అద్భుతంగా వచ్చినప్పటికీ ఎన్టీఆర్ ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా డబ్బింగ్ అంత క్లియర్ గా రాలేదు.ఇదే విషయాన్ని ఎన్టీఆర్ గారి తో చెప్పినప్పుడు తర్వాత చేద్దామని.

Telugu Biopic, Chandrababu, Chandrakant, Mohan Babu, Snenior Ntr, Tollywood-Movi

ఈ సినిమాకు డబ్బింగ్ కూడా మరోసారి చెప్పారు.అలా అనుకోకుండా ఊహించని నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube