9 రోజుల్లో మూడు ప్లాప్స్.. విజయ్ సేతుపతి కెరిర్ కు సమస్య?

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ నటుడు కేవలం హీరోగా మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలోనైనా అయితే ఇమిడిపోతూ నటనకు, ఆ పాత్రకు ప్రాణం పోశాడు.

 Back To Back 3 Flops To Vijay Sethupathi Within 9 Days Period Vijay Sethupathi,-TeluguStop.com

ఇలా వెండి తెరపై ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన రికార్డులను సాధించుకున్న విజయ్ సేతుపతి ఈ ఏడాది ఉప్పెన, మాస్టర్ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో అద్భుతమైన రికార్డులను తిరగరాసిన విజయ్ సేతుపతి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వరుస ఫ్లాపులతో అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చారు.

ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మూడు ఫ్లాపులు కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలో రావడం గమనార్హం.

Telugu Kollywood, Labam, Tollywood, Tughlaq Durbar-Movie

విజయ్ సేతుపతి హీరోగా నటించినటువంటి లాభం చిత్రం సెప్టెంబర్ 9వ తేదీన విడుదలై పరాజయం పాలైంది.అదేవిధంగా సెప్టెంబర్ 10 వ తేదీ డైరెక్ట్ టెలివిజన్ లో ప్రసారమైన తుగ్ల‌క్ ద‌ర్బార్.ఆపై 11న ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయింది.

 అదేవిధంగా సెప్టెంబర్ 17వ తేదీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన అనాబెల్ సేతుప‌తి విజయ్ సేతుపతి జీవితంలో అత్యంత డిజాస్టర్ సినిమా అని చెప్పవచ్చు.ఇలా తొమ్మిది రోజుల వ్యవధిలో మూడు ప్లాప్ లను చవిచూసిన విజయ్ సేతుపతి అభిమానులను ఎంతో నిరాశ పరిచారని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube