అమెరికన్స్ కు కుచ్చుటోపి.. భారతీయుడికి 20 ఏళ్ళ జైలు శిక్ష.. అసలేం జరిగిందంటే...

ప్రపంచ దేశాలు సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి.టెక్నాలజీ మనిషికి ఎంత మంచి చేస్తోందో అలాగే మోసాలు జరగటానికి కూడా కారణం అవుతోంది.

 A Hat For American An Indian Man Sentenced To 20 Years In Prison Is What Actuall-TeluguStop.com

ఇదే సాంకేతికతను అడ్డం పెట్టుకొని అక్రమంగా డబ్బులు సంపాదించాలానే అత్యాశ కొంతమందిలో ఎక్కువవుతోంది.ఎన్నో మోసాలు చేస్తున్నారు, కాని చేసిన మోసాలకు చివరకు శిక్ష అనుభవించక తప్పదు.

ఇదే జరిగింది అమెరికాలోని మెక్నోజియా అనే భారత సంతతి వ్యక్తికి.

మక్నోజియా వయసు 37 ఏళ్ళు.

ఏప్రిల్ 2019-అక్టోబర్2019 మధ్య కాలం లో ఓ టెలీమార్కెటింగ్ స్కీంలో పనిచేసేవాడు.అయితే ఆ టెలీమార్కెటింగ్ స్కీమ్స్ అన్ని తానే నడుపుతున్నానని బాధితులను నమ్మించి,మెయిల్ ఫ్రాడ్ కి పాల్పడ్డాడు.

ఇండియన్ కాల్ సెంటర్ ద్వారానే కథంతా నడిపిస్తూ దాదాపు 70 మంది అమెరికన్లను బురిడి కొట్టించి పెద్ద మొత్తంలో డబ్బు కాచేసాడు.నకిలీ పేర్లు, పత్రాలతో పార్సిల్లను చేజిక్కించుకున్నాడు.

అంతటితో ఆగకుండా ఈ స్కీం లో ఫెడరల్ ఏజంట్లు నిఘా పెట్టారని, తమ పేరు స్కీం లోనుంచి తేసేయాలంటే ఫెడ్ ఎక్స్ ద్వార డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసేవాడు.ఈ తరహాలో 70 పార్సిల్లను దోచేసాడు

అయితే చివరకు దొరికిపోయి ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

అమెరికా తాత్కాలిక అటార్నీ తెలిపిన వివరాల ప్రకారం.ఇతనికి 20 ఏళ్ళ జైలు శిక్షతో పాటు, 250 వేల డాలర్లు కూడా జారిమాన ను విధించారు.

ప్రస్తుతం అరెస్ట్ చేసి కస్టడిలో ఉంచిన, ఈ శిక్ష డిసెంబర్ 13 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube