ఐదు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వ్య‌క్తి.. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..?

ఇప్పుడు క‌రోనా ఎంత‌లా మ‌న‌ల్ని అత‌లాకుత‌లం చేస్తుందో చూస్తూనే ఉన్నాం.ఇలాంటి త‌రునంలో ఈ క‌రోనాను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గం అని అంద‌రికీ తెలిసిందే.

 A Person Who Has Taken Five Doses Of Vaccine, Vaccine, Carona, Uttar Pradesh, Me-TeluguStop.com

అయితే ఈ వ్యాక్సినేస‌న్ విష‌యంలా చాలా చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.చాలా చోట్ల ఒకే వ్య‌క్తికి ఒకేసారి రెండు లేదంటే మూడు డోసుల వ్యాక్సిన్లు వేయ‌డం లేదంటే రెండు వేర్వేరు డోసులు వేస్తున్న సంగ‌తి కూడా మ‌న‌కు తెలిసిందే.

అయితే ఇలాంటి విచిత్ర ఘ‌ట‌న ఒకటి ఇప్పుడు చోటుచేసుకుంది.అదేంటో తెలుసుకుందాం.

ఇప్పుడు వ్యాక్సిన్ డోస్ కోసం కూడా చాలామంది ఎదురుచూస్తున్నారు మ‌న దేశంలో.కొంద‌రు మొద‌టి డోస్ కోసం ఎదురుచూస్తుంటే ఇంకొంద‌రు మాత్రం రెండో డోస్ కోసం వెయిట్ చేస్తున్నారు.

కాగా ఓ వ్య‌క్తికి మాత్రం ఏకంగా ఐదు డోసుల వ్యాక్సిన్ వేసేసుకున్న‌ట్టు స‌ర్టిఫికెట్ కూడా పొందాడు.యూపీలోని మీరఠ్ లో నివ‌సిస్తున్న రామ్ పాల్ సింగ్ అనే యువ‌కుడు రీసెంట్ గానే రెండో డోసు వ్యాక్సిన్ తీసుకుని స‌ర్టిఫికెట్ కోసం వెళ్లాడు.

కాగా ఆ సర్టిఫికెట్ లో మాత్రం ఆయ‌న ఐదు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న‌ట్టు వ‌చ్చిది.

Telugu Carona, Corona Wave, Corona Vaccine, Doses Vaccinde, Meerut, Ram Pal Sing

దీంతో అత‌ను ఆశ్చ‌ర్య‌పోయి దానిపై ఆరా తీశాడు.అయితే ఆయ‌న గ‌త మార్చి నెల‌16వ తేదీన మొద‌టి డోసు తీసుకున్నాడ‌ని చెప్తున్నాడు.కాగా తాను రెండో డోసు మాత్రం రీసెంట్ గా తీసుకోగా స‌ర్టిఫికెట్ లో మాత్రం ఆయ‌న‌కు ఐదు డోసులు తీసుకున్న‌ట్టు వ‌చ్చింది.

ఏకంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో కూడా తీసుకున్న‌ట్టు అందులో ఉందంట.దీంతో ఆయ‌న అధికారులను ఆశ్ర‌యించి జ‌రిగిన దానిపై వివ‌ర‌ణ ఇచ్చాడు.ఇక స‌ర్టిఫ‌కెట్లో వ‌చ్చిన ఈ తప్పుపై ఆఫీస‌ర్లు విచార‌ణ చేస్తున్నారు.కాగా ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube