వామ్మో.. అక్క‌డ కిలో బంగాళాదుంప‌లు రూ.3వేలు..

ప్ర‌స్తుతం దేశంలో నిత్య‌వ‌స‌ర వ‌స్తుల ధ‌ర‌లు ఏ స్థాయిలో భ‌గ్గుమంటున్నాయో అంద‌రికీ తెలిసిందే.ఏ వ‌స్తువు చూసినా విప‌రీతంగా ధ‌ర‌లు పెరిగిపోయి సామాన్య మాన‌వుడికి అంద‌ని స్థాయిలో ఉంటోంది.

 Ho My God .. There Are 3 Thousand Rupees Per Kilo Of Potatoes . Potatoes, Afghan-TeluguStop.com

ఇక‌పోతే ప‌ప్పులు, ఉప్పులు, నూనెల్లాంటివి అయితే మ‌ధ్య త‌ర‌గ‌తి వారు కొన‌లేని స్థితిలో ఉన్నాయి.అయితే ఇప్పుడు మ‌న దేశంలోని ప‌రిస్థితులే ఇలా ఉంటే ఇక ఆరాచకంగా మారిపోయిన ఆఫ్ఘ‌నిస్తాన్ ప‌రిస్థితి ఏంటి ఒక‌సారి ఆలోచించండి.

ఏ దేశం అయినా స‌రే ఆ దేశ స్వార్థం త‌ప్ప మిగ‌తా దేశాల గురించి ప‌ట్టించుకోక‌పోతే ఆ పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఇప్పుడు ఆఫ్ఘ‌నిస్తాన్ చూస్తే అర్థం అవుతుంది.

ఇక ఇప్పుడు తాలిబన్ల ఏలుబడిలో ఆఫ్ఘాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత ఘోరంగా త‌యారైంది.

క‌నీసం తిన‌డానికి కూడా ఇబ్బంది క‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి.ఇక‌పోతే సామాన్య జ‌నం నిత్య‌వ‌స‌ర స‌రుకులు కొనేందుకు ఏకంగా త‌మ వ‌ద్ద ఉండే కార్లు, బైకులు కూడా అమ్ముకుంటున్నారంట‌.

ఎందుకంటే ఈ దేశంలో ఆహార పదార్థాల ధరలు విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో ఇప్పుడు తిండి తిన‌డమే ఇక్క‌డ పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని చెబుతున్నారు.కుటుంబసభ్యులకు భోజనం పెట్టటానికి కూడా త‌మ వ‌ద్ద డ‌బ్బులు లేక ఇలా విలువైన వ‌స్తువుల‌ను అమ్ముకుంటున్న‌ట్టు చెబుతున్నారు.

Telugu Kg Potatos, Thousand Rupees, Afghanisthan, Cars, Potatoes-Latest News - T

ఇందుకు నిద‌ర్శ‌నంగా అక్క‌డ ఒక్క కిలో బంగాళదుంపలు కొన‌లేక‌పోతున్నారంట‌.ఎందుకంటే కేవ‌లం కిలో బంగాళా దుంప‌లు ఏకంగా రూ.3వేలు ఉన్నాయంటే ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.ఇత‌ర దేశాల నుంచి ఆహార ప‌దార్థాల దిగుమతి పూర్తిగా ఆగిపోవ‌డం లేదంటే త‌గ్గిపోవ‌డంతో ఇలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయ‌ని చెబుతున్నారు.

ఇక బ్యాంకులు కూడా స‌రిగ్గా పని చేయకపోవటంతో ఇలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డి భారీగా ధ‌ర‌లు పెరిగిపోతున్నాయంట‌.ఇంకొన్ని రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటే బ్ర‌త‌కడం కూడా క‌ష్ట‌మేఅని ఆకలి చావులు సంభ‌విస్తాయ‌ని వాపోతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube